హుజురాబాద్ ఉపఎన్నికల్లో భాగంగా ముమ్మరప్రచారం నిర్వహిస్తున్న బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పెద్దపల్లి ఎమ్మెల్యే మనోమర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికల్లో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బిజెపి పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఇవాళ(సోమవారం) నియోజకవర్గ పరిధిలోని వీణవంక మండలం ఎల్బాకలో ఈటల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
''CM KCR పచ్చటి సంసారంలో నిప్పు పెట్టారు. మానవ సంబంధాలకు మచ్చ తీసుకువస్తున్నారు. మనం ఎల్బాక నుండే ఎక్కువ మంది నాయకులను చేసుకున్నాం. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఊసరవెల్లులు. వారి గురించి మాట్లాడడం ఇజ్జత్ తక్కువ'' అని మండిపడ్డారు.
undefined
''గొల్ల కురుమలకు గొర్లు నా రాజీనామా తరువాతనే వచ్చాయి. అది కూడా ఒక్క హుజురాబాద్ మాత్రమే వచ్చాయి. అది మీ మీద ప్రేమ కాదు... మీ ఓట్ల మీద ప్రేమ. ప్రతిఒక్కరు ఈ విషయాన్ని గుర్తించాలి'' అని ఈటల సూచించారు.
READ MORE Huzurabad ByPoll: చేతగానోడే దొంగదెబ్బ కొట్టాలని చూస్తాడు: కేసీఆర్‌పై ఈటల సంచలన వ్యాఖ్యలు
''peddapalli ఎమ్మెల్యే manohar reddy కి టికెట్ నేనే ఇప్పించా. ఆయన గెలుపుకోసం నేనే వెళ్లి ప్రచారం చేసా. ఇప్పుడు ఆయన కూడా వచ్చి నాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు. ఆయన్ను చూసి పెద్దపల్లి ప్రజలు నవ్వుకుంటున్నారు. కూట్లో రాయి తీయలేని వాడు ఏట్లో తీస్తా అని పోయాడట. అలాగే వుంది పెద్దపల్లి ఎమ్మెల్యే తీరు. కేసిఆర్ బొమ్మతో గెలుస్తా అనుకుంటున్నారు. ఇకపై KCR బొమ్మకు ఓటు పడదు. పెద్దపల్లి కి వస్తా కాసుకో'' అని ఈటల హెచ్చరించారు.
''BJP కి ఓటు వేస్తే పథకాలు రావు అంటున్నారట. కెసిఆర్ నీది నిజాం సర్కార్ కాదు... ఇది నీ జాగీరు కాదు. రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తున్నావు. అంబేద్కర్ ఇచ్చిన హక్కును కాలరాస్తున్నావు. నీ ఆటలు ఎక్కువ రోజులు నడవవు'' అని ఈటల హెచ్చరించారు.
READ MORE హుజురాబాద్ ఉపఎన్నిక: భారీగా డబ్బు, బంగారం సీజ్... ఎంతో తెలుసా..?
''మా రాజేందర్ అన్నకు కేసిఆర్ అన్యాయం చేశారు అని ప్రతీకారం తీర్చుకోవడానికి హుజూరాబాద్ ప్రజలు సిద్దం అవుతున్నారు. కేసిఆర్ కు ముఖం చెల్లడం లేదు. రాజేందర్ అన్న పేరు చెబితేనే ఓట్లు పడతాయని నా గుర్తు కారు అని చెప్తున్నారట. వారు అబద్ధాలకోరులు... అప్రమత్తంగా ఉండండి'' అని హెచ్చరించారు.
''2023 లో తెరాసా పార్టీ కథ కంచికే. ఈ సారి కులాల పంచాయతీ కాదు. కేసిఆర్ దుర్మార్గానికి హుజూరాబాద్ ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది. దళిత బంధు, పెన్షన్, రేషన్ కార్డులు, గొర్లు అన్నీ నా వల్లనే వచ్చాయి. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయినా తెచ్చిన కెసిఆర్ కే ఓటు వేశారు. ఇప్పుడు కూడా అన్నీ తెచ్చిన నాకు ఓటు వెయ్యండి'' అని ఈటల కోరారు.