
వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో శుక్రవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4.43 నిమిషాలకు ఈ భూకంపం నమోదయింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 30కిమీ లోతులో భూకంప కదలికలు సంభవించాయని తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సమాచారాన్ని షేర్ చేసింది.