
మంచిర్యాల జిల్లాలో (mancherial district) శనివారం భూ ప్రకంపనలు (earthquake) కలకలం సృష్టించాయి. జిల్లా కేంద్రంలో భూ ప్రకంపనలు సంభవించడంతో.. ప్రాణ భయంతో ఇళ్ల నుంచి రోడ్ల మీదకు పరుగులు తీశారు ప్రజలు. పట్టణంలోని చున్నంబట్టి వాడ, శ్రీశ్రీ నగర్, సీతారాంపల్లి, నస్పూర్, సీతారాంపూర్ తదితర ప్రాంతాల్లో రెండు సెకండ్ల పాటు భూమి కంపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇంటిలోని సామాన్లు, వస్తువులు, కిటికీలు ఊగడంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.