సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల భూకంపం: భయంతో జనం పరుగులు

By narsimha lodeFirst Published Jan 27, 2024, 5:55 PM IST
Highlights


సంగారెడ్డి  జిల్లాలో పలు చోట్ల భూకంపం చోటు చేసుకుంది.

 హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలోని పలు చోట్ల శనివారం నాడు సాయంత్రం భూకంపం చోటు చేసుకుంది. భూకంపంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేశారు. భయంతో  జనం ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.జిల్లాలోని న్యాల్ కల్, ముంగి తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూప్రకంపనలకు సంబంధించి అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. అధికారుల సంఘటన స్థలానికి చేరుకుని  సమాచారం సేకరిస్తున్నారు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో  భూకంపం వాటిల్లుతుంది.   అండమాన్ దీవుల్లో  ఈ నెల  10వ తేదీన  భూకంపం చోటు చేసుకుంది.  ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు.

2023  డిసెంబర్  30వ తేదీన  మణిపూర్ లో భూకంపం వాటిల్లింది. న్యూఢిల్లీలోని  2023  అక్టోబర్ 3న  భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సుమారు  40 సెకన్ల పాటు భూప్రకంపనలు చోటు చేసుకున్నట్టుగా  భూకంప శాస్త్రవేత్తలు తెలిపారు.నేపాల్ కేంద్రంగా  భూకంప కేంద్రం  ఉందని  శాస్త్రవేత్తలు ప్రకటించారు.2023 జూన్ 13న ఢిల్లీ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో  భూకంప్రనలు చోటు చేసుకున్నాయి.  

రిక్టర్ స్కేల్ పై  5.4 తీవ్రతగా నమోదైంది.సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో  2023  ఫిబ్రవరి  19న  భూకంపం చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం, మేళ్ల చెర్వు, హుజూర్ నగర్ తదితర ప్రాంతాల్లో భూకంపం చోటు చేసుకుంది. తెలంగాణలోని హైద్రాబాద్ లోని బోరబండ పరిసర ప్రాంతాల్లో  భూప్రకంపనలు గతంలో  స్థానికులను భయబ్రాంతులకు గురి చేసిన విషయం తెలిసిందే. 

click me!