నవంబర్ లోనే ఎన్నికలు:ఈటల

Published : Sep 27, 2018, 05:29 PM IST
నవంబర్ లోనే ఎన్నికలు:ఈటల

సారాంశం

ఎన్నికల కమిషన్ వేగం చూస్తుంటే నవంబర్‌లోనే ఎన్నికలొచ్చే అవకాశం ఉందని మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. మహా కూటమి ఏర్పడటంతోనే టీఆర్ఎస్ విజయం ఖాయమైపోయిందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలుసునన్నారు. 

హైదరాబాద్: ఎన్నికల కమిషన్ వేగం చూస్తుంటే నవంబర్‌లోనే ఎన్నికలొచ్చే అవకాశం ఉందని మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. మహా కూటమి ఏర్పడటంతోనే టీఆర్ఎస్ విజయం ఖాయమైపోయిందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలుసునన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. త్వరలోనే లబ్దిదారులకు అందుతాయని స్పష్టం చేశారు.

కొన్ని చోట్ల భూమి లేకపోవడం వల్లే డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం ఆలస్యమైందని ఈటల తెలిపారు. నియోజకవర్గాల్లో వ్యక్తుల కంటే పథకాలకే ప్రజలు ఆకర్షితులవుతున్నారని చెప్పుకొచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనాలు ఇస్తున్నామని తెలిపారు. పింఛన్లు, రుణమాఫీ అమలు చేసి చూపించామన్నారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు ఆశీర్వదిస్తున్నట్లు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?