Dussehra holidays: తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి దసరా సెలవులు ప్రారంభం అయ్యాయి. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు శుక్రవారం నుంచి సెలవులు ప్రకటించారు. వచ్చే బతుకమ్మ పండగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇక సెలవుల నేపథ్యంలో పిల్లలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు. పిల్లలు సెలవుల్లో ఆడుకుంటూ ప్రమాదాల బారినపడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
Telangana: తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి దసరా సెలవులు ప్రారంభం అయ్యాయి. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు శుక్రవారం నుంచి సెలవులు ప్రకటించారు. వచ్చే బతుకమ్మ పండగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇక సెలవుల నేపథ్యంలో పిల్లలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు. సెలవుల్లో ఆడుకుంటూ ప్రమాదాల బారినపడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
వివరాల్లోకెళ్తే.. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు శుక్రవారం నుంచి సెలవులు ప్రకటించారు. మళ్లీ ఈ నెల 26న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే గురువారం రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మలతో ఘనంగా వేడుకలు నిర్వహించారు. బాలికలు బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ పండుగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు స్వగ్రామాలకు చేరుకోవడంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ నెలకొంది.
undefined
1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ-1) పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఈ పరీక్షల ఫలితాలను సెలవుల తర్వాత ప్రకటిస్తారు. అదనంగా, ఫార్మేటివ్ అసెస్‌మెంట్-1, 2 పరీక్షలకు సంబంధించిన మార్కులను చైల్డ్ ఇన్ఫోలో గురువారం ముందు నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. కాగా, జూనియర్ కాలేజీలకు కూడా ఈ నెల 19 నుంచి 25 వరకు సెలవులు మంజూరు చేశారు. ఇక సెలవుల నేపథ్యంలో పిల్లలు ఆడుకుంటూ ప్రమాదాల బారినపడే అవకాశముంటుందనీ, తల్లిదండ్రులు వారిపై జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇదిలావుండగా, బతుకమ్మ నేపథ్యంలో ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటా కానుకగా అందించే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో చీరలు పంపిణీ పూర్తయిందని సమాచారం. పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లలు, మహిళలు చీరలు అందుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిందనీ, ఈ ఏడాది 250 రకాల డిజైన్లలో బతుకమ్మ చీరలు అందుబాటులోకి వచ్చాయని అధికార వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 14న బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానుండగా, ఆ తేదీ కంటే ముందే మహిళలకు చీరలను పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముమ్మరంగా సన్నాహాలు చేసిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి ప్రభుత్వం బతుకమ్మ చీరలను మహిళలకు కానుకగా అందించి నేతన్నకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ద్వంద్వ లక్ష్యంతో పంపిణీకి శ్రీకారం చుట్టింది.