దుబ్బాక సౌండ్ ఇది: కేసీఆర్‌పై రఘునందన్ పంచ్‌లు

By Siva KodatiFirst Published Nov 10, 2020, 7:42 PM IST
Highlights

దుబ్బాక ఉప ఎన్నికలో తనను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు బీజేపీ నేత రఘునందన్ రావు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విజయం పూర్తిగా దుబ్బాక ప్రజలకే అంకితం చేస్తున్నానని.. తన చివరి శ్వాస వరకు దుబ్బాక నియోజకవర్గానికే సేవ చేస్తానని తెలిపారు.

దుబ్బాక ఉప ఎన్నికలో తనను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు బీజేపీ నేత రఘునందన్ రావు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విజయం పూర్తిగా దుబ్బాక ప్రజలకే అంకితం చేస్తున్నానని.. తన చివరి శ్వాస వరకు దుబ్బాక నియోజకవర్గానికే సేవ చేస్తానని తెలిపారు.

ఆగస్టు 17 నుంచి నేటి వరకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రఘునందన్ కృతజ్ఞతలు తెలిపారు. ఏ గడ్డ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించామో, న్యాయవాద వృత్తిని వదిలి ఏప్రిల్ 27, 2001 జలదృశ్యం నుంచి జై తెలంగాణ అన్నామో ఈ సిద్ధిపేట ప్రజల తీర్పు ప్రగతి భవన్‌ వరకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.

తనకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Also Read:గజ్వేల్‌కు కిలోమీటర్ దూరంలో బీజేపీ: కేసీఆర్‌కు సంజయ్ కౌంటర్

ఈ ఎన్నికల్లో తనతో పాటు కలిసి పనిచేసిన బూతు కమిటీ మిత్రులపై లాఠీఛార్జ్ చేయడంతో పాటు ఎన్నో కేసులు పెట్టారని.. వారంతా సంగారెడ్డి జైల్లో ఉండటం బాధాకరమన్నారు.

ఏ గడ్డపై కేసీఆర్ చదువుకున్నారో.. అక్కడి నుంచి వచ్చిన రీసౌండ్ ఇదని రఘునందన్ హెచ్చరించారు. అరాచకం, నియంతృత్వం, ఒక వ్యవస్థను నాశనం చేసి కేవలం.. వ్యవస్ధల ద్వారా పెత్తనం చేసి, వ్యక్తులను హింసించాలని చూస్తే చప్పుడు ఇలాగే వస్తుందని దుబ్బాక ప్రజలు చూపించారని ఆయన తెలిపారు.

దుబ్బాక నుంచి డల్లాస్ దాకా తెలుగు ప్రజలు కేసీఆర్‌కు గుణపాఠం కావాలని కోరుకున్నారని రఘునందన్ వ్యాఖ్యానించారు. 

click me!