దుబ్బాక బైపోల్: చిట్టాపూర్‌లో సత్తా చాటిన టీఆర్ఎస్

By narsimha lodeFirst Published Nov 10, 2020, 12:10 PM IST
Highlights

 దుబ్బాక అసెంబ్లీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన సోలిపేట సుజాత స్వగ్రామం చిట్టాపూర్ లో టీఆర్ఎస్ తన ఆధిక్యతను నిలుపుకొంది.


సిద్దిపేట:  దుబ్బాక అసెంబ్లీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన సోలిపేట సుజాత స్వగ్రామం చిట్టాపూర్ లో టీఆర్ఎస్ తన ఆధిక్యతను నిలుపుకొంది.

చిట్టాపూర్ లో టీఆర్ఎస్ అభ్యర్ధి సుజాతకు 846 ఓట్లు వచ్చాయి.ఇదే గ్రామంలో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావుకు 406 ఓట్లు దక్కాయి. ఈ గ్రామంలో బీజేపీ కంటే 440 ఓట్ల మెజారిటీ వచ్చింది.

also read:దుబ్బాక బైపోల్: స్వగ్రామంలో ఆధిక్యతను నిలుపుకున్న బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు

ఈ గ్రామంలో వచ్చిన మెజారిటీ ఆరో రౌండ్ లో వచ్చిన  మెజారిటీయే బీజేపీ అభ్యర్ధి కంటే సుజాత ఆధిక్యాన్ని సాధించింది.ఐదు రౌండ్ల వరకు బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావుకు ఆధిక్యతను సాధించింది. ఆరు, ఏడు రౌండ్లలో కూడ టీఆర్ఎస్ మెజారిటీ సాధించింది.

గ్రామీణ ఓటర్లపైనే టీఆర్ఎస్ ఆశలు పెంచుకొంది. పట్టణ ప్రాంతాల ఓటర్లు బీజేపీ వైపుకు మొగ్గు చూపారు.బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు స్వగ్రామం బొప్పాపూర్ లో టీఆర్ఎస్ పై ఆయన పైచేయి సాధించారు.

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగ్రామం పోతారంలో టీఆర్ఎస్ అభ్యర్ధి సుజాత కంటే బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావుకు ఆధిక్యంలో ఉన్నారు.

click me!