దుబ్బాక బైపోల్: స్వగ్రామంలో ఆధిక్యతను నిలుపుకున్న బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు

Published : Nov 10, 2020, 11:47 AM IST
దుబ్బాక బైపోల్: స్వగ్రామంలో ఆధిక్యతను నిలుపుకున్న బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు

సారాంశం

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తన స్వగ్రామంలో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావుకు ఆధిక్యత దక్కింది. ప్రత్యర్ధుల కంటే ముందంజలో ఉన్నారు.  


సిద్దిపేట: దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తన స్వగ్రామంలో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావుకు ఆధిక్యత దక్కింది. ప్రత్యర్ధుల కంటే ముందంజలో ఉన్నారు.

బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు స్వగ్రామం దుబ్బాక మండలంలోని బొప్పాపూర్. ఈ గ్రామంలో రఘునందన్ రావుకు 424 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాతకు 147 ఓట్లు వచ్చాయి. రఘునందన్ రావుకు తన సమీప ప్రత్యర్ధి సుజాత కంటే 277 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.

also read:దుబ్బాక బైపోల్: కాంగ్రెస్ ను దెబ్బ తీసిన ప్రచారం

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగ్రామం పోతారంలో  బీజేపీ అభ్యర్ధి 110 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.పోతారంలో టీఆర్ఎస్ అభ్యర్ధి సుజాత కంటే బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావుకు 110 ఓట్ల ఆధిక్యత దక్కింది.

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ లో ఆరు రౌండ్లలో  ఐదు రౌండ్లలో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోటా పోటీగా ఫలితాలు వస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్