కవితకు భయం పట్టుకుంది: డిఎస్ తనయుడు

Published : Jun 27, 2018, 02:24 PM IST
కవితకు భయం పట్టుకుంది: డిఎస్ తనయుడు

సారాంశం

తన తండ్రి డి. శ్రీనివాస్ పై నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ఫిర్యాదు చేయడంపై సంజయ్ స్పందించారు. 

నిజామాబాద్: తన తండ్రి డి. శ్రీనివాస్ పై నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ఫిర్యాదు చేయడంపై సంజయ్ స్పందించారు. 

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ డీఎస్‌పై టీఆర్ఎస్ నేతలు సీఎంకు లేఖ రాసిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ నేతల లేఖలో రాజకీయ అపరిపక్వత కనిపిస్తోందని అన్నారు. టీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలు హాస్యాస్పదమన్నారు. 


టీఆర్ఎస్ ఎంపీ కవితకు ఓటమి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. కొడుకు మీద కోపంతో తండ్రిపై చర్యలు తీసుకోవాలనడం విడ్డూరంగా ఉందని సంజయ్ అన్నారు. 
బుధవారం ఉదయం అనచురులతో డీఎస్ జరిపిన చర్చలో తనయుడు సంజయ్ కూడా పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే