జగిత్యాలలో నకిలీ వేలిముద్రల తయారీ గుట్టురట్టు

Published : Jun 27, 2018, 01:37 PM ISTUpdated : Jun 27, 2018, 02:20 PM IST
జగిత్యాలలో నకిలీ వేలిముద్రల తయారీ గుట్టురట్టు

సారాంశం

దేశవ్యాప్తంగా కలకలం...

నకిలీ వేలిముద్రలను సృష్టించి వాటి ద్వారా సిమ్ లను పొందుతున్న ఓ వ్యక్తిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.సిమ్ కార్డులను విక్రయించే ఏజంట్  పనిచేస్తున్న ఇతడి నుండి దాదాపు 6 వేల నకిలీ వేలిముద్రల స్టాంపులను జగిత్యాల జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఇలా వేలిముద్రలను కూడా నకిలీవి తయారుచేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

జగిత్యాల జిల్లా ధర్మారంలో నకిలీ వేలిముద్రల స్టాంపులను ఓ వ్యక్తి తయారుచేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారాన్న ఆధారంగా చేసుకుని ధర్మారం పాత బస్టాండు వద్ద ధనలక్ష్మి కమ్యూనికేషన్ పేరుతో సంతోష్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న కంప్యూటర్ సెంటర్ పై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పోలీసులకు దాదాపు 6 వేల నకిలీ వేలిముద్రల స్టాంపులు లభించాయి.

దీంతో నిర్వహకుడు సంతోష్ ని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు అసలు నిజం తెలిసింది. ఇతడు సిమ్ లను పొందడానికే ఇలా నకిలీ వేలిముద్రల తయారీ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇతడు ఇందుకోసమే ఈ వేలిముద్రలను వాడాడా, లేక మరేదైన పనులకోసం వాడి ఉంటాడా అన్న దానిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.  ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించడంతో దీనిపై సమగ్ర నివేధిక ఇవ్వాలని ధర్మారం పోలీసులకు డిసిపీ ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

Invite KCR To Medaram Jatara: కేసీఆర్ కు మేడారం ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు| Asianet News Telugu
Real estate: హైద‌రాబాద్‌లోని ఈ శివారు ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కావ‌డం ఖాయం.. ఇప్పుడే కొనేయండి