
మేడ్చల్‌లో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదవుతున్న సంధ్య అనే యువతి.. తెల్లవారుజామున హాస్టల్ నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.
వెంటనే గమనించిన హాస్టల్ సిబ్బంది, తోటి విద్యార్థులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సంధ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో హాస్టల్‌లో విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు,