మితిమీరిన మందుబాబుల ఆగడాలు: యువతిని బైకులతో అడ్డగించి...

Published : Jan 12, 2020, 11:12 AM ISTUpdated : Jan 12, 2020, 09:47 PM IST
మితిమీరిన మందుబాబుల ఆగడాలు: యువతిని బైకులతో అడ్డగించి...

సారాంశం

శనివారం అర్థరాత్రి కూడా అలాంటిదే ఒక సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని బేగంపేట్ లోని హై ఫైవ్ పబ్బు ను మూసివేయించడానికి అర్థరాత్రి వచ్చిన పోలీసులతో లోడ్ లో ఉన్న మందుబాబులు గొడవకు దిగారు. 

హైదరాబాద్: నగరంలో మందుబాబుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే వీరి వేషాలు మితిమీరుతున్నాయి. అర్థరాత్రి వరకు ఫూటుగా మద్యం తాగడం ఆతరువాత రోడ్డుపైకొచ్చి వీరంగం సృష్టించడం వీరికి అలవాటయిపోయింది.  

నిన్న శనివారం అర్థరాత్రి కూడా అలాంటిదే ఒక సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని బేగంపేట్ లోని హై ఫైవ్ పబ్బు ను మూసివేయించడానికి అర్థరాత్రి వచ్చిన పోలీసులతో లోడ్ లో ఉన్న మందుబాబులు గొడవకు దిగారు. 

Also read: మోడల్ పై దారుణం: యువకుడు రేప్ చేస్తుంటే వీడియో తీసిన మిత్రుడు

అక్కడితో ఆగకుండా, మద్యం మత్తులో పోలీసులపైనే దాడికి ప్రయత్నించారు. దీంతో ఖాఖీలు దురుసుగా ప్రవర్తించిన తాగుబోతులను అదుపులోకి తీసుకుని పంజగుట్ట పోలీసుస్టేషన్ కు తరలించారు. 

పబ్ లోనే కాదు పబ్ బయట కూడా తాగుబోతు కామాంధులు రెచ్చిపోయారు. అదే పబ్బుకు వస్తున్న ఓ యువతిని దారిలో రెండు బైకులతో వెంబడించి వేధించారు. వెకిలి చేష్టలు చేస్తూ, అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ... కోరిక తీర్చాలంటూ యువతిని వెంబడిస్తుండటంతో ఆమె భయపడి గట్టిగా కేకలు వేసింది. 

ఈ కేకలు విన్న బాయ్ ఫ్రెండ్, యువతిని కాపాడేందుకు వచ్చాడు. అతడితో కూడా  కామాంధులు గొడవకుదిగారు. ఆ సమయంలో అక్కడున్నవారు ఆ కామాంధులను గట్టిగా  నిలదీయడంతో యువతిని విడిచిపెట్టి పరారయ్యారు.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు