కేసిఆర్ కాన్వాయ్ కి అడ్డొచ్చిన తాగుబోతు

Published : Mar 16, 2018, 06:32 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
కేసిఆర్ కాన్వాయ్ కి అడ్డొచ్చిన తాగుబోతు

సారాంశం

సికింద్రాబాద్ లో సిఎం కాన్వాయ్ కి అడ్డు వచ్చిన తాగుబోతు అదుపులోకి తీసుకున్న పోలీసులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ వాహన శ్రేణికి ఊహించని అనుభవం ఎదురైంది.

సికింద్రాబాద్ లోని ఖార్ఖానా  వైపు సిఎం కేసిఆర్ కాన్వాయ్ వెళ్తున్నది.

ఆ సమయంలో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిపి వేశారు.

జనాలను కూడా రోడ్డు మీదకు రానీయలేదు.

అయితే కాన్వాయ్ వెళ్తుండగా.. మార్గమధ్యంలో ఒక వ్యక్తి తప్పతాగి సిఎం కాన్వాయ్ కి అడ్డుగా వచ్చాడు.

 దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే ఆ వ్యక్తిని అక్కడ బందోబస్త్ లో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నారు.

ఆ వ్యక్తి తప్పతాగి సిఎం కారుకు అడ్డు రావడంతోనే అదుపులోకి తీసుకున్నట్లు మహాంకాళి ఎసిపి వినోద్ తెలిపారు.

సిఎం కేసిఆర్ ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ సంఘటన జరిగింది. 

ఈ సంఘటనకు బాధ్యుడైన ఎస్సై పై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది.

దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana
School Holidays : ఈ వారంలో ఇంకో నాల్రోజులే స్కూళ్లు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే