మద్యం సేవించి కారు డ్రైవింగ్.... పోలీసు పై మహిళ వీరంగం

By telugu teamFirst Published Sep 28, 2019, 11:49 AM IST
Highlights

తమ కారు సీజ్ చేశారంటూ పద్మ, శ్రీనులు పోలీసులతో వాగ్వాదానికి దిగడం గమనార్హం. జరిమానా చెల్లించిన తర్వాతే కారు అప్పగిస్తామని పోలీసుల చెప్పడంతో పద్మ ఆందోళనకు దిగింది. రోడ్డుపై బైఠాయించి న్యూసెన్స్ క్రియేట్ చేసింది.  ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం గమనార్హం. 

మద్యం మత్తులో ఓ మహిళ వీరంగం సృష్టించింది. మద్యం సేవించి వాహనం నడిపి... అడ్డంగా పోలీసులకు బుక్కైనదేగాక... వారితో వాగ్వాదానికి దిగింది. ఈ సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే....సింగరేణి కాలనీకి  చెందిన మునావత్ పద్మ, శ్రీను గురువారం రాత్రి బంధువుల ఇంటికి వెళ్లి కారులో తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో వారిద్దరూ విపరీతంగా మద్యం సేవించి ఉన్నారు.  కాగా.. వారి వాహనాన్ని చంపాపేట రోడ్డులోని మినర్వ గార్డెన్ వద్ద చార్మినార్ ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. బ్రీత్ ఎన్ లైజర్ తో పరీక్ష చేయగా...మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు.

దీంతో వారిపై కేసు నమోదు చేసి పోలీసులు కారు సీజ్ చేశారు. కాగా... తమ కారు సీజ్ చేశారంటూ పద్మ, శ్రీనులు పోలీసులతో వాగ్వాదానికి దిగడం గమనార్హం. జరిమానా చెల్లించిన తర్వాతే కారు అప్పగిస్తామని పోలీసుల చెప్పడంతో పద్మ ఆందోళనకు దిగింది. రోడ్డుపై బైఠాయించి న్యూసెన్స్ క్రియేట్ చేసింది.  ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం గమనార్హం. 

తాము మద్యం సేవించాం కానీ... తమ కారు డ్రైవర్ మద్యం తాగలేదని వారు వాదించారు. ట్రాఫిక్ పోలీసు రూ.5వేలు లంచం డిమాండ్ చేశారంటూ వారు వాదించడం విశేషం. కాగా... తాము ఎవరినీ లంచం అడగలేదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. తమ విధులకు ఆటంకం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని వారు  చెప్పడం గమనార్హం. 

click me!