మద్యం మత్తులో తండ్రిని చంపిన తనయుడు..!

Published : Jul 27, 2021, 07:48 AM IST
మద్యం మత్తులో తండ్రిని చంపిన తనయుడు..!

సారాంశం

ఈ మత్తులో తండ్రిని నానా మాటలు అన్నాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం కాస్త ఘర్షణ గా మారింది. 

మద్యం మత్తులో ఓ వ్యక్తి.. రక్తం పంచిన తండ్రినే అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆదిలాబాద్ లోని కైలాస్ నగర్ లోని ఎస్సీ కాలనీలో ఉంటున్న మోదుగుపల్లి బొందాలు(65) కుమారుడు సురేష్ లు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం రాత్రి తండ్రి కొడుకుల మధ్య  వాగ్వాదం చోటుచేసుకుంది. అప్పటికే సురేష్ పీకలదాకా మద్యం సేవించి ఉన్నాడు.

ఈ మత్తులో తండ్రిని నానా మాటలు అన్నాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం కాస్త ఘర్షణ గా మారింది. ఈ క్రమంలోనే తాగిన మైకంలో ఉన్న సురేష్.. తండ్రి బొందాలుని బండ రాయితో మోది హత్య చేశాడు. తలకు తీవ్ర గాయం కావడంతో.. బొందాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Khairatabad Byelection : రెండేళ్ల కిందే ఖైరతాబాద్ సీటు ఖాళీ..: తెలంగాణ ప్రభుత్వ గెజిట్
Bathukamma Celebrations : గిన్నిస్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా బతుకమ్మ వేడుకలు.. ప్లాన్ ఇదే..: కల్వకుంట్ల కవిత