మద్యం మత్తులో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య !!

By AN Telugu  |  First Published Apr 27, 2021, 3:06 PM IST

సిద్దిపేట జిల్లా, చేర్యాలలో దారుణం జరిగింది. మద్యం ఓ నిండుప్రాణాన్ని బలితీసుకుంది. మత్తులో ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితిలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 


సిద్దిపేట జిల్లా, చేర్యాలలో దారుణం జరిగింది. మద్యం ఓ నిండుప్రాణాన్ని బలితీసుకుంది. మత్తులో ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితిలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

మద్యం మత్తులో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చేర్యాల మండలంలోని కడవేర్గులో చోటుచేసుకుంది. ఎస్సై రాకేష్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నర్సింములు (32) మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వాడు.

Latest Videos

ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. అది మంచి అలవాటు కాదు మానేయ్యమని చెబుతున్న కుటుంబ సభ్యులను బెదిరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మద్యం సేవించి.. వ్యవసాయ బావి దగ్గరికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు.

అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం బావి వద్దకు వెళ్లి చూడగా చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. ఇదివరకు కూడా రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించినా.. అప్పుడు చావునుంచి బయటపడగా మూడో ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు.

 అతనికి భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 


 

click me!