మద్యం మత్తులో ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి... తాగుబోతు దుర్మరణం (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Jun 01, 2021, 02:20 PM ISTUpdated : Jun 01, 2021, 02:22 PM IST
మద్యం మత్తులో ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి... తాగుబోతు దుర్మరణం (వీడియో)

సారాంశం

మద్యం మత్తులో విచక్షణను కోల్పోయిన ఓ తాగుబోతు ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి భయపెట్టే ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయాడు.

హైదరాబాద్: భార్యతో గొడవపడి ఓ తాగుబోతు భర్త దారుణానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో విచక్షణను కోల్పోయిన అతడు ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్ కు గురవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్ లోని సైదాబాద్ లో ఓ అపార్ట్ మెంట్ లో అక్భర్(40) వాచ్ మెన్ గా పనిచేస్తూ భార్య అజ్మీరా తో కలిసి వుండేవాడు. అయితే మద్యానికి బానిసయిన అక్బర్ నిత్యం భార్యతో గొడవపడేవాడు. ఇలాగే మద్యం సేవించి వచ్చి సోమవారం మద్యాహ్నం కూడా భార్యతో గొడవపడ్డాడు. 

గొడవ తర్వాత భార్యపై కోపంతో ఇంట్లోంచి బయటకు వెళ్ళిన అక్బర్ సమీపంలోని ఓ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఎక్కాడు. దీంతో కరెంట్ వైర్లు తాకడంతో తీవ్రమైన విద్యుత్ షాక్ గురయి కిందపడిపోయాడు. కరెంట్ షాక్ తో పాటు బాగా ఎత్తునుండి కిందపడటంతో తీవ్రమైన గాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. 

వీడియో

 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా  స్థలానికి చేరుకుని  మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనను కొందరు సెల్ ఫోన్లలో వీడియో తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!