చర్లపల్లికి ప్రియాంక నిందితులు: హై సెక్యూరిటీ బ్లాక్‌లో సెల్, ఖైదీ నెంబర్లు ఇవే

Published : Nov 30, 2019, 07:25 PM ISTUpdated : Nov 30, 2019, 07:42 PM IST
చర్లపల్లికి ప్రియాంక నిందితులు: హై సెక్యూరిటీ బ్లాక్‌లో సెల్, ఖైదీ నెంబర్లు ఇవే

సారాంశం

ప్రియాంక రెడ్డి నిందితులను పోలీసులు షాద్‌నగర్ నుంచి చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. వీరి రాకను తెలుసుకున్న ప్రజాసంఘాలు, విద్యార్ధులు జైలు వద్దకు చేరుకుని నిందితులను ఉరి తీయాలంటూ నినాదాలు చేశారు.

ప్రియాంక రెడ్డి నిందితులను పోలీసులు షాద్‌నగర్ నుంచి చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. వీరి రాకను తెలుసుకున్న ప్రజాసంఘాలు, విద్యార్ధులు జైలు వద్దకు చేరుకుని నిందితులను ఉరి తీయాలంటూ నినాదాలు చేశారు.

అనంతరం జైలు అధికారులు నిందితులకు ఖైదీ నెంబర్లు కేటాయించారు. ఏ1 మహ్మద్ పాషాకు 1979, ఏ2 బొల్లు శివకు 1980, ఏ3 చెన్నకేశవులకు 1981, ఏ4 నవీన్‌కు 1982 నెంబర్లను కేటాయించారు.  జనం భారీగా తరలిరావడంతో చర్లపల్లి జైలు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

Also Read:ప్రియాంక నిందితులకు షాక్: వాదించేది లేదు, బార్ అసోసియేషన్ తీర్మానం

నిందితులను తమకు అప్పగించాలని లేదంటే తక్షణమే ఉరి తీయాలంటూ నినాదాలు చేశారు. పరిస్ధితి అదుపు తప్పడంతో పోలీసులు పలువురు నిరసనకారులను అరెస్ట్ చేశారు. 

డాక్టర్ ప్రియాంక రెడ్డిపై అత్యాచారం, హత్య నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజా సంఘాలు, ప్రజలు భగ్గుమంటున్నాయి. నిందితులకు ఉరిశిక్ష వేయాలంటూ పలువురు కోరుతున్నారు. ఇదే సమయంలో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ బార్ అసోసియేషన్ సైతం కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రియాంక నిందితుల పక్షాన లాయర్లు ఎవ్వరూ వాదించకూడదని నిర్ణయించింది, అలాగే బాధితురాలి కుటుంబసభ్యులకు న్యాయ సహాయం చేయాలని తీర్మానించాయి. అలాగే నిందితులకు బెయిల్ కోసం ఎవరూ సహకారం అందించకూడదని విజ్ఞప్తి చేశాయి.

నిందితులకు కఠినమైన శిక్షపడే వరకు న్యాయపోరాటం చేస్తామని న్యాయవాదులు స్పష్టం చేశారు. ఇంతటి హేయమైన చర్యను తాము ఖండిస్తున్నామని బార్ అసోసియేషన్ తెలిపింది. 

తమ బిడ్డను దారుణంగా హత్య చేసిన నిందితులకు ఉరిశిక్ష విధించాలన్నారు డాక్టర్ ప్రియాంక రెడ్డి తండ్రి శ్రీధర్ రెడ్డి. ఓ ఆడిపిల్ల తల్లీగా నిందితుల తరపున ఏ న్యాయవాదీ వాదించొద్దని అభ్యర్ధిస్తున్నాని ఆయన వాపోయారు.

సమాజంలో జరుగుతున్న నేరాలపై అవగాహన లేకే తన కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని.. మరో ఆడపిల్లకు ఇలా జరగకుండా పోలీసులు అవగాహన కల్పించాలని శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు.

నిందితులకు ఉరిశిక్ష వేస్తేనే న్యాయం జరిగినట్లని... ఫాస్ట్ ట్రాక్ కోర్టు కేసును త్వరగా పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వారికి ఉరిశిక్ష పడితినే తన బిడ్డ ఆత్మ శాంతిస్తుందని శ్రీధర్ రెడ్డి తెలిపారు.

Also Read:హైదరాబాద్: జల్సా కోసం రప్పించి వేధింపులు, 100కు బాధితురాలి కాల్

అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సైతం నిందితుల తరపున వాదించేందుకు ఏ న్యాయవాది ముందుకు రావొద్దని సూచించారు. ప్రియాంకరెడ్డిపై అత్యంతదారుణంగా ప్రవర్తించి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రియాంకరెడ్డి హత్యను ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. 

PREV
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu