సర్కారు డబుల్ బెడ్రూమ్ బద్దలైంది

Published : Jul 14, 2017, 10:23 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
సర్కారు డబుల్ బెడ్రూమ్ బద్దలైంది

సారాంశం

దేవరకొండలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు బద్దలైంది మెట్ల స్లాబ్ విరిగి కిందపడింది. ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. నిర్మాణ లోపాలను పట్టించుకోని అధికారగణం

డబుల్ బెడ్రూమ్ ఇల్లు బద్దలైంది

 

టిఆర్ఎస్ పార్టీకి గత సార్వత్రిక ఎన్నికల్లో డబుల్ బెడ్రూముల ఇల్లు ఓట్ల వర్షం కురిపించింది. టిఆర్ఎస్ అధికారంలోకి తీసుకొచ్చిన పథకాల జాబితాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు టాప్ లో ఉంటది. వచ్చే ఎన్నికల్లోనూ ఈ పథకం మీద భారీ ఆశలే పెట్టుకుంది టిఆర్ఎస్. కానీ ఆ డబుల్ బెడ్రూముల ఇల్లు ఇప్పటివరకు అర్హుల జాబితాలో ఒక్కశాతం మందికి కూడా రాలేదు. కానీ వచ్చిన అరకొర ఇండ్లు సైతం నిర్మాణ లోపాలతో బద్దలవుతున్నాయి.

కెసిఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూముల ఇండ్ల నిర్మాణంలో లోపాలు మరోసారి బయటపడ్డాయి. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గములో కొండభీమనపల్లి గ్రామ పంచాయతీ లొ డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణంలో లోపాలు బయటపడ్డాయి. ఇల్లు నిర్మాణంలో ఉండగానే మెట్ల స్లాబ్ విరిగి పడింది. దీంతో ఒక వ్యక్తికి గాయయాలయ్యాయి. ఆయనను దేవరకొండ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu
Revanth Reddy Press Meet: సర్పంచ్ ల గెలుపు పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu