పంట రుణాలు చెల్లించొద్దు, అధికారంలోకి రాగానే మాఫీ: తునికిమెట్లలో రేవంత్ రెడ్డి హామీ

By narsimha lodeFirst Published May 22, 2022, 1:23 PM IST
Highlights

తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. పంట రుణాలు చెల్లించవద్దని కూడా రేవంత్ రెడ్డి రైతులను కోరారు.

వరంగల్: తమ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వస్తే క్వింటాల్ వరి ధాన్యాన్ని రూ. 2500లకు కొనుగోలు చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.రైతు Rythu Racha Banda  కార్యక్రమంలో భాగంగా టీపీసీసీచీఫ్  Revanth Reddy  ఆదివారం నాడు ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లాలోని తునికి మెట్లలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు పంట రుణాలకు సంబంధించిన బకాయిలను చెల్లించవద్దని కూడా రేవంత్ రెడ్డి సూచించారు. ఏడాది తర్వాత రాష్ట్రంలో Congress  పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల రుణాలను మాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. 

KCR  ఢిల్లీ వెళ్లారు. KTR థావోస్ వెళ్లాడు. రాష్ట్ర ప్రలు సంతోషంగా సంతోషంగా ఉన్నారన్నారు. ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలంటే కేసీఆర్, కేటీఆర్ లను  Telangana  పొలిమేరలు దాటించాలని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ చేతిలో మోసపోనివారు ఎవరైనా ఉన్నారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం రైతులు ప్రతి క్వింటాల్ పై వెయ్యి రూపాయాలు నష్టపోతున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు.

జొన్నలు, మొక్కజొన్న,కందులు, పత్తి, మిర్చి, పసుపు వంటి పంటలకు ఇచ్చేధరలను కూడా రేవంత్ రెడ్డి ఇచ్చారు.  తాము పండించిన పంటకు ధరను నిర్ణయించుకొనే హక్కు రైతులకే ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు అప్పుల పాలు కాకుండా ఉండాలనేది తమ విధానమన్నారు. అందుకే Warangal లో రాహుల్ గాంధీ సభలో రైతులకు ఏం చేస్తున్నామో వివరించినట్టుగా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.రైతు రచ్చబండ కార్యక్రమం గురించి  కాంగ్రెస్ పార్టీ నేతలు గ్రామాల్లో ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. 

also read:అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల రుణమాఫీ:రేవంత్ రెడ్డి

వరంగల్ లో రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ ను ప్రకటించింది.ఈ నెల 6వ తేదీన వరంగల్ డిక్లరేషన్ ను  కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.  తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయనున్నామనే విషయమై కాంగ్రెస్ పార్టీ ఈ డిక్లరేషన్ ను ప్రకటించింది.తమ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల పంట రుణాన్ని మాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్ లో రైతాంగ సమస్యలను కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది.తమ పార్టీ అధికారంలోకి  వస్తే రైతులకు ఏ రకమైన ప్రయోజనం కలిగించనున్నారో కాంగ్రెస్ పార్టీ ఈ డిక్లరేషన్ లో  ప్రకటించింది.

వరంగల్ డిక్లరేషన్ ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  గ్రామాల్లో ప్రచారం చేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21  నుండి జూన్ 21 వరకు రాష్ట్రంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  వరంగల్ డిక్లరేషన్ ను గ్రామాల్లో ప్రచారం చేయనున్నారు. రైతు రచ్చబండ పేరుతో వరంగల్ డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది.

నెల రోజుల పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర నేతలు గ్రామాల్లో పర్యటిస్తూ రైతు రచ్చబండపై విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సుమారు 400 మంది కాంగ్రెస్ అగ్రనేతలు విస్తృతంగా వరంగల్ డిక్లరేషన్ పై ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. 

click me!