మైక్రోఫైనాన్స్ యాప్‌లతో అప్రమత్తంగా ఉండాలి: సజ్జనార్

By narsimha lodeFirst Published Dec 25, 2020, 12:41 PM IST
Highlights

 ఇన్‌స్టంట్ లోన్ ఇచ్చే యాప్ ల విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని  సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలను  కోరారు. 
  ఏదైనా అనుమానం వస్తే తమను సంప్రదించాలని ఆయన కోరారు.
 

హైదరాబాద్: ఇన్‌స్టంట్ లోన్ ఇచ్చే యాప్ ల విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని  సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలను  కోరారు. 
  ఏదైనా అనుమానం వస్తే తమను సంప్రదించాలని ఆయన కోరారు.

శుక్రవారం నాడు హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటర్నెట్ లో ఇష్టమొచ్చిన యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవద్దని ఆయన సూచించారు.లోన్ యాప్ ల విషయంలో ఇంకా జాగ్రత్తగా తీసుకోవాలని ఆయన కోరారు. ఆర్బీఐ గుర్తింపు పొందిన యాప్ ల నుండి  మాత్రమే లోన్ తీసుకోవాలన్నారు.

also read:మైక్రో ఫైనాన్స్ యాప్స్: గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించాలని గూగుల్‌కి పోలీసుల లేఖ

మైక్రో ఫైనాన్స్ యాప్స్ పై  పోలీస్ శాఖ లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు. ఇన్‌స్టంట్ లోన్ ఇచ్చే యాప్ ల విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.   ఏదైనా అనుమానం వస్తే తమను సంప్రదించాలని ఆయన కోరారు.

ఇన్‌స్టంట్ యాప్ ల పేరుతో లోన్లు ఇస్తూ వేధింపులకు పాల్పడుతున్నవారి విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. ఈ వేధింపులు భరించలేక ఎవరూ కూడ ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు.

ఆన్ లైన్ రుణాలు ఇచ్చే యాప్ లకు నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయనే విషయమమై ఆరా తీస్తున్నామని సజ్జనార్ చెప్పారు. చైనా, సింగపూర్ నుండి నిధులు వచ్చాయా అనే కోణంలో కూడ దర్యాప్తు చేస్తున్నామన్నారు.

యాప్ ల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన చైనా వాసి పరారీలో ఉన్నట్టుగా చెప్పారు. ఈ యాప్ ల విషయంలో ఎఫ్ బీ ఎఫ్ సీలతో సంబంధం లేదన్నారు. 


 

click me!