నా పుట్టినరోజు వేడుకలలొద్దు... సీఎం కేసీఆర్ చెప్పినట్లు చేయండి: కేటీఆర్ ప్రకటన

By Arun Kumar PFirst Published Jul 23, 2021, 2:38 PM IST
Highlights

తన పుట్టినరోజు వేడుకల కోసం ఎవ్వరూ హైదరాబాద్ కు రావద్దని ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రేపు(శనివారం) తనకు పుట్టినరోజున విషెస్ తెలపడానికి ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరూ హైదరాబాద్ రావద్దని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు, అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. 

మరో రెండు మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి సూచించారు. అవసరమైన చోట సహాయక చర్యల్లో పాల్గొనాలని... ప్రజలకు అండగా వుండాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలను పాటించాలని సూచించారు. పార్టీ శ్రేణులంతా ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని కేటీఆర్ సూచించారు. అందుకోసమే రేపు తాను ఎవరిని కలవడం లేదని... ఈ విషయంలో అన్యధా భావించవద్దని పార్టీ శ్రేణులను కేటీఆర్ కోరారు. 

read more   #GiftASmile: కేటీఆర్ ఉదారత... తన పుట్టినరోజున దివ్యాంగులకు అదిరిపోయే గిప్ట్

ఇప్పటికే విజ్ఞప్తి చేసిన మేరకు తన పుట్టినరోజు సందర్భంగా ఎవరికి తోచిన విధంగా వారు ఇతరులకు సహాయం అందించాలన్నారు. ఇప్పటికే ముక్కోటి వృక్షార్చను తలపెట్టిన నేపథ్యంలో రేపు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతిఒక్కరు మొక్కలు నాటాలని కేటీఆర్ మరోసారి విజ్ఞప్తి చేశారు.  

కేటీఆర్ బర్త్ డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా వికలాంగులకు ఇవ్వాలని భావించిన ద్విచక్రవాహనాలను వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఇవ్వనున్నట్లు కేటీఆర్ కార్యాలయం ప్రకటించింది. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అనేక విజ్ఞప్తులు మంత్రి కేటీఆర్ కి వస్తున్నాయని... వాటన్నిటిని తమ కార్యాలయం క్రోడీకరించి  ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఈ వాహనాలను అందజేస్తామని తెలిపింది.
 

click me!