నా పుట్టినరోజున ఆ గిప్ట్ కావాలి : కేటీఆర్

First Published Jul 23, 2018, 12:25 PM IST
Highlights

పురపాలక, ఐటీ మంత్రిగా ప్రభుత్వంలోనే కాకుండా టీఆర్ఎస్ పార్టీని ముందుకు నడుపుతూ కల్వకుట్ల తారక రామారావు తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి తనయుడైనప్పటికి ఎలాంటి గర్వం, మిడిసిపాటు లేకుండా కింది స్థాయి నాయకులతోనూ, ప్రజలతోను ఆయన మమేకమవుతున్నారు. అయితే ఇలాంటి నాయకుడి పుట్టినరోజంటే అభిమానులు, పార్టీ నాయకుల హడావుడి మామూలుగా ఉంటుందా. రేపు 24వ తేదీన కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఇప్పటికే నగరంలో భారీ ప్లెక్సీలు వెలిసాయి. భారీ ఏర్పాట్లకు కూడా స్థానికంగా ఉండే పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
అయితే తన పుట్టినరోజు సందర్భంగా ప్లెక్సీలు, హూర్డింగ్ ,ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయరాదని మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు, అభిమానులకు సూచించారు. అలాగే పత్రికల్లో, టీవీల్లో ప్రకటనల కోసం భారీగా ఖర్చు చేయవద్దని, ఆ డబ్బునే సీఎం సహాయ నిధికి విరాళంగా ఇవ్వాలని కేటీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలకు ఇబ్బందిగా, వర్షాకాలంలో ప్రమాదకరంగా వెలిసిన తన పుట్టినరోజు శుభాకాంక్షల హోర్డింగ్ లను, ప్లెక్సీలను తొలగించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్, మేయర్‌లను కోరారు. 

అయితే తనకు పుట్టిన రోజు కానులకను కూడా పంపవద్దని కేటీఆర్ సూచించారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరు తన పుట్టినరోజును పురస్కరించుకుని ఓ మొక్కను నాటాలని, అదే మీరు తనకిచ్చే పెద్ద గిప్ట్ అని కేటీఆర్ అన్నారు. పూల బొకేలను, ప్లెక్సీలకయ్యే చిన్న ఖర్చులను కూడా సీఎం సహాయ నిధికి పంపించాలని మంత్రి కేటీఆర్ తెలిపారు.
 
click me!