
ఏపీ సీఎం జగన్‌కు స్కిల్ డెవలప్‌మెంట్ అంటే అర్థం తెలుసా అని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌పై ఆరోపణలు చేశారు. సీఐడీ వ్యవస్థను అడ్డు పెట్టుకొని కేసులను డీల్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై సీఐడీ దాడులు చేస్తున్నారని హెచ్చరించారు. ఇన్సైడ్ ట్రేడింగ్ చేయడం ఏమైందని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‌మెంట్ పై సీఎం జగన్ కు అవగాహన లేదని అన్నారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు స్కిల్ డెవెలప్ మెంట్ పై పరిశోదనలు చేసి ఇండిస్ట్రియల్ ఆఫీసర్స్‌తో మాట్లాడేవారని తెలిపారు. ఈ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు రెండున్నర లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చి, జాబ్‌లు పొందేలా చేశారని తెలిపారు. ఆ రిపోర్ట్‌లను వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలగించారని ఆరోపించారు.
విశాఖలో సీఎం జగన్ పర్యటన.. కాన్వాయ్ మార్గంలో మెరుపు ధర్నా!
ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా ?
జగన్ సీఎం అయ్యాక ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా అని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. ఏ విషయాన్నైనా పక్కకు తప్పించడం సీఎంకు బాగా తెలుసని విమర్శించారు. రామచంద్రారెడ్డిపై ఎంక్వెరీ చేయాల్సింది మానేసి ఇతర అధికారులను ఎంక్వేరి చేయడం ఏంటని ప్రశ్నించారు. రూ.240 కోట్లు ఎక్కడికి వెళ్లాయో చెప్పాలని అన్నారు. ఇప్పుడు అభియోగాలు మోపుతున్న ఇద్దరు అధికారులకు సంబంధం ఏంటని అన్నారు. ఈ కేసులో ముఖ్యమైన వ్యక్తిని ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. కొన్ని సార్లు మహిళలతో ఫిర్యాదులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఏ విషయంలోనూ రూల్స్ ఎందుకు పాటించడం లేదని అన్నారు. పోలీసు డిపార్ట్‌మెంట్ కూడా ఎందుకు ఇలా మారిపోయిందని ఆరోపించారు.
బాబును ఆలింగనం చేసుకున్న రఘురామ.. అంత ఇష్టమైతే, వైసీపీకి రాజీనామా చేయ్: బాలినేని
ప్రత్యేక హోదా ఏమైంది ?
సీఎం స్థాయిలో ఉండి చేపలు, మటన్, సినిమా టిక్కెట్లు అమ్ముకోవడం ఏంటని ప్రశ్నించారు ? వైఎస్ఆర్ సీపీకి చెందని నాయకులను ఎంపీలుగా గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన సీఎం.. ఇప్పుడు ఏం సమాధానం చెపుతారని అన్నారు. జగన్ తన కేసుల కోసం ప్రధాని మోడీ కాళ్లు పట్టుకుంటున్నారని ఆరోపించారు. జగన్‌కు సీఎంగా ఉండటానికి అర్హత ఉందా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలో ఉన్న రెండున్నరేళ్లలో 200 కేసులు పడ్డాయని, ఈ విషయంలో జగన్ సిగ్గుపడాలని అన్నారు. ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదని తెలిపారు. ఇలా కక్ష సాధింపు చర్యలు చేయడం నైతికం అనిపించుకోదని అన్నారు. జగన్ జైళ్లో ఉన్నందుకు అందరినీ జైళ్లో ఉంచాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ అంశంలో అభివృద్ధి చేశారని ప్రశ్నించారు.