మూసీ అందాలను చూద్దామని వెళ్లి..

Published : Aug 24, 2020, 10:01 AM ISTUpdated : Aug 24, 2020, 10:07 AM IST
మూసీ అందాలను చూద్దామని వెళ్లి..

సారాంశం

ఆదివారం తన మిత్రులతో కలిసి ఆదివారం డ్యామ్ వద్దకు వెళ్లాడు. రెండు గేట్ల ద్వారా దిగువకు వెళ్తున్న నీటిలో సరాదాగా ఆడుకుంటున్న క్రమంలో  సాయి కాలు జారి పడిపోయాడు. 

మూసీ ప్రాజెక్టు అందాలను చూసి వద్దామని స్నేహితులతో వెళ్లాడు. ఆనందంగా వెళ్లిన ఆ యువకుడు చివరకు శవమై మిగిలాడు. ప్రమాదవశాత్తు నీటిలో పడి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇటీవల భారీ వర్షాల కారణంగా మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసిన సంగతి తెలిసిందే. దీంతో.. మూసీ నది అందాలను చూడాలని కొందరు యువకులు తాపత్రయపడ్డారు. వారిలో నల్గొండ జిల్లా నకిరేకల్ కు చెందిన పుట్టల సాయి(26) కూడా ఉన్నాడు. 

కాగా... ఆదివారం తన మిత్రులతో కలిసి ఆదివారం డ్యామ్ వద్దకు వెళ్లాడు. రెండు గేట్ల ద్వారా దిగువకు వెళ్తున్న నీటిలో సరాదాగా ఆడుకుంటున్న క్రమంలో  సాయి కాలు జారి పడిపోయాడు. దీంతో.. వరద నీటిలో కొట్టుకుపోయి.. బండ రాళ్ల మధ్య ఇరుక్కున్నాడు. దీంతో.. తీవ్రగాయాలపాలై యువకుడు మృతి చెందాడు. కాగా.. సరదా కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Mutton : కిలో చికెన్ ధరకే కిలో మటన్.. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే..!
Kavitha Emotional Speech: నా మీద కక్ష కట్టి పార్టీ నుంచి నెట్టేశారు | Asianet News Telugu