స్ట్రెయిన్ పై అప్రమత్తంగా ఉన్నాం : తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా. శ్రీనివాస్

By AN TeluguFirst Published Dec 22, 2020, 3:57 PM IST
Highlights

యూకేలో కొత్తరం వైరస్ స్ట్రెయిన్ వచ్చిన నేపథ్యంలో తెలంగాణలో వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా. శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు వైద్య, విద్య సంచాలకుడు డా. రమేష్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 
 

యూకేలో కొత్తరం వైరస్ స్ట్రెయిన్ వచ్చిన నేపథ్యంలో తెలంగాణలో వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా. శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు వైద్య, విద్య సంచాలకుడు డా. రమేష్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 

కొత్తరకం వైరస్ కు సంబంధించి కేంద్రం ఇప్పటికే పలు సూచనలు చేసిందన్నారు. విదేశాల నుంచి హైదరాబాద్ వస్తున్న వారి విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అప్రమత్తం అయ్యారని శ్రీనివాస్ వెల్లడించారు.

నిన్న యూకే నుంచి ఏడుగురు ప్రయాణికులు తెలంగాణకు వచ్చారు. ఈ నెల 15 నుంచి 21 వరకు ఒక్క యూకే నుంచే 358మంది నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. 25 నవంబర్ నుంచి 22 డిసెంబర్ వరకు వివిధ దేశాల నుంచి తెలంగాణకు వచ్చిన వారందరినీ పర్యవేక్షణలో ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. 

గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రానికి వచ్చిన వారికి శంషాబాద్ విమానాశ్రయంలో కొవిడ్ పరీక్ష చేశాం. అందరికీ నెగెటివ్ వచ్చింది. ఇదే మాదిరిగా గత వారం రోజులుగా రాష్ట్రానికి వచ్చిన వారిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహిస్తాం. ఈ ప్రజారోగ్య శాఖ కార్యాలయంలో 040-24651119 నంబర్ ను ఏర్పాటు చేశాం. 

గతవారం రోజుల్లో యూకే నుంచి తెలంగాణకు వచ్చినవారు ఎవరైనా ఈ నంబర్ ను సంప్రదించాలి. జిల్లా, రాష్ట్ర పర్యవేక్షణ బృందాలు వారి వద్దకు చేరుకుని వారి ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. అవసరమైతే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తాం అని తెలిపారు. 

click me!