డెంగ్యూతో వైద్యుడి మృతి...హైదరాబాద్ లో చికిత్స పొందుతూ....

By Arun Kumar PFirst Published Aug 28, 2018, 11:33 AM IST
Highlights

డెంగ్యూ...దోమల కారణంగా వచ్చే అత్యంత భయంకరమైన జ్వరం. దీని భారినపడి ఏకంగా ఓ వైద్యుడే మృతి చెందిన విషాద సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో తెలంగాణలో మరొసారి డెంగ్యూ జ్వరాల భయం పట్టుకుంది.
 

డెంగ్యూ...దోమల కారణంగా వచ్చే అత్యంత భయంకరమైన జ్వరం. దీని భారినపడి ఏకంగా ఓ వైద్యుడే మృతి చెందిన విషాద సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో తెలంగాణలో మరొసారి డెంగ్యూ జ్వరాల భయం పట్టుకుంది.

మంచిర్యాల జిల్లా వేమనపల్లికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రష్పాల్ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా ఇతడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని హైదరాబాద్ లోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. అయితే ఇతడికి డెంగ్యూ వచ్చినట్లు గుర్తించిన వైద్యులు ప్లేట్ లెట్స్ స్థాయి పూర్తిగా పడిపోయినట్లు తెలిపారు. దీంతో అతడికి మెరుగైన వైద్యం అందించే క్రమంలో ఇవాళ ఉదయం పరిస్థితి విషమించి మృతిచెందాడు. 

అయితే ఇతడిని చివరి క్షణంలో ఆస్పత్రికి తీసుకురావడంతో కాపాడలేక పోయామని వైద్యులు తెలిపారు.రష్పాల్ స్వగ్రామమైన కోటపల్లి మండలం మల్లంపేట లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అయితే వర్షాకాలంలో దోమకాటుకు గురవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటి కారణంగా ప్రాణాంతకమైన డెంగ్యూ తో పాటు అనేక రకాల రోగాలు వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని దోమలు, వాటి లార్వా పెరగకుండా చూసుకోవాలని వారు సూచిస్తున్నారు.
 

click me!