వైద్యం ముసుగులో డ్రగ్స్ విక్రయాలు.. హైదరాబాద్‌లో డాక్టర్ అరెస్ట్

By Siva Kodati  |  First Published Jan 13, 2023, 6:57 PM IST

హైదరాబాద్‌లో డ్రగ్స్ అమ్ముతున్న డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుదీప్ దగ్గర నుంచి ఎండీఎంఏ, కెటమిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 


హైదరాబాద్‌లో డ్రగ్స్ అమ్ముతున్న డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందని సుదీప్, బిశ్వాస్‌లను కూడా అదుపులోకి తీసుకున్నారు. పర్‌ఫెక్ట్ డెంటల్ క్లినిక్ పేరుతో డాక్టర్ వైద్యం చేస్తున్నాడు. కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించి విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. సుదీప్ దగ్గర నుంచి ఎండీఎంఏ, కెటమిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 

ఇదిలావుండగా... పశ్చిమ బెంగాల్ లో ఉన్న ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో పెద్ద ఎత్తున చొరబాటు దారుల అరెస్టులు, కోట్లాది రూపాయల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్టు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) తెలిపింది. గతేడాది (2022)లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) నార్త్ బెంగాల్ ఫ్రాంటియర్ సరిహద్దులో 237 మంది బంగ్లాదేశ్ జాతీయులతో సహా 444 మందిని అరెస్టు చేయడంలో విజయం సాధించింది.

Latest Videos

అలాగే..పెద్ద ఎత్తున నిషేధిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు  బీఎస్ఎఫ్ వెల్లడించింది. బీఎస్ఎఫ్ గణాంకాల ప్రకారం.. ఉత్తర బెంగాల్ ఫ్రాంటియర్ పశ్చిమ బెంగాల్‌లోని 5 జిల్లాలు అంటే దక్షిణ్ దినాజ్‌పూర్, ఉత్తర దినాజ్‌పూర్, డార్జిలింగ్, జల్‌పైగురి , కూచ్‌బెహార్‌లోని భూమి, నదీ సరిహద్దుల వెంబడి 936 కిలోమీటర్ల ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దును కాపాడుతుందని BSF సమాచారం. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి మోహరించిన ఉత్తర బెంగాల్ ఫ్రాంటియర్ యొక్క సరిహద్దులల్లో అక్రమ రవాణా, చొరబాటు ప్రయత్నం జరుగుతోంది. అయితే.. వాటిని అడుకోవడంలో బీఎస్ఎఫ్ విజయం సాధిస్తునే ఉంది. 

Also REad: హైదరాబాద్ శివారులో డ్రగ్స్‌ విక్రయిస్తూ పట్టుబడ్డ నైజీరియన్.. విచారణలో వెలుగులోకి కీలక విషయాలు..

గత ఏడాది 2022లో నార్త్ బెంగాల్ ఫ్రాంటియర్ దళం 3430 పశువుల అక్రమ రవాణాను, 7 కోట్లకు పైగా నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నాయని BSF ప్రతినిధి తెలిపారు. మరోవైపు, మాదక ద్రవ్యాల కేసులో 77454 ఫిన్‌సెడైల్ బాటిళ్లు, 1126.76 కిలోల గంజాయి, 24223 నంబర్ యాబా ట్యాబ్లెట్లు, 0.158 గ్రాముల హెరాయిన్, 300.25 కిలోల బ్రౌన్ షుగర్‌ను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. 

దీంతో పాటు 5640.23 గ్రాముల బంగారం, 10.371 కిలోల వెండిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. ఇది మాత్రమే కాదు.. 2022లో వివిధ దేశంలో తయారు చేసిన ఆయుధాలు, 2 మ్యాగజైన్‌లు, 3 బ్యాటరీతో పనిచేసే IEDలు మరియు 200 గ్రాముల సల్ఫర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అదనంగా, 2022లో నార్త్ బెంగాల్ ఫ్రాంటియర్‌లోని సరిహద్దు గార్డులు వేర్వేరు సరిహద్దు నేరాలకు పాల్పడిన 207 మంది భారతీయ పౌరులు, 237 మంది బంగ్లాదేశ్ జాతీయులను అరెస్టు చేశారు. ఉత్తర బెంగాల్ ఫ్రాంటియర్‌లోని భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దులో మోహరించిన మొత్తం 874 బిఎస్‌ఎఫ్ మహిళా సెంటినెల్స్ ప్రకృతి వైపరీత్యాలను ఉన్నప్పటికీ మన దేశాల సరిహద్దులను సమర్థవంతంగా కాపాడుతున్నాయని BSF తెలిపింది.

click me!