దళితబంధు పథకం అంటే తెలుసా?: వాసాలమర్రివాసులను ప్రశ్నించిన కేసీఆర్

By narsimha lodeFirst Published Aug 4, 2021, 5:06 PM IST
Highlights


 వాసాలమర్రిలో గ్రామస్తుల సమస్యలను సీఎం కేసీఆర్ తెలుసుకొన్నారు. బుధవారం నాడు గ్రామంలో ఆయన పర్యటించారు.దళిత వాడలో 3 గంటల పాటూ ఆయన పర్యటించారు.

భువనగరి: దళిత భంధు పథకం గురించి తెలుసా అని తెలంగాణ సీఎం కేసీఆర్ వాసాలమర్రి వాసులను ప్రశ్నించారు.  బుధవారం నాడు దత్తత గ్రామం వాసాలమర్రిలో ఆయన పర్యటించారు. గ్రామంలోని దళితవాడలో సుమారు 3 గంటల పాటు ఆయన పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడారు  60 ఇండ్లలోకి వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకొన్నారు. 

also read:వాసాలమర్రిలో కేసీఆర్ టూర్: దళిత కాలనీలో పర్యటన

దళితబంధు పథకం కింద ప్రతి ఇంటికి రూ. 10 లక్షలిస్తే ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు.  పది లక్షలతో డెయిరీ ఫాం పెట్టుకొంటామని కొందరు గ్రామస్తులు సీఎంకు చెప్పారు. ట్రాక్టర్లు కొనుగోలు చేసి వ్యాపారం చేస్తామని మరికొందరు సీఎంకు చెప్పారు.గ్రామంలో పెన్షన్ అందుతోందా అని కూడ సీఎం కేసీఆర్ ఆరా తీశారు. పెన్షన్ రానివారికి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు.

రెండు రోజుల్లో పెన్షన్ అందని బీడీకార్మికులకు పెన్షన్ అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.దళిత వాడల్లో కూలిపోవడానికి సిద్దంగా ఉన్న ఇళ్లను చూసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రోడ్లు,డ్రైనేజీలు ప్లాన్ ప్రకారంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించాలని సీఎం అధికారులను కోరారు.


 

click me!