తెలంగాణలో ప్రారంభమైన కొత్త రేషన్‌కార్డుల పంపిణీ..

By AN TeluguFirst Published Jul 26, 2021, 3:22 PM IST
Highlights

రాబోయే వారం రోజుల్లో అర్హులైన అందరికీ కొత్తగా మంజూరైన రేషన్‌కార్డులు అందజేస్తామని తెలిపారు. వరంగల్‌ గ్రామీణ జిల్లా రాయపర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రేషన్‌కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. 

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో రేషన్‌కార్డుల పంపిణీ ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు నూతన రేషన్‌పత్రాలను అందజేశారు. పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. ఇందులో భాగంగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన ఆహార భద్రతా కార్డులను ఇస్తున్నట్లు చెప్పారు. 

రాబోయే వారం రోజుల్లో అర్హులైన అందరికీ కొత్తగా మంజూరైన రేషన్‌కార్డులు అందజేస్తామని తెలిపారు. వరంగల్‌ గ్రామీణ జిల్లా రాయపర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రేషన్‌కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. 

ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో ఆయన నూతన రేషన్‌ పత్రాలను అందజేశారు. హైదరాబాద్‌ బేగంపేటలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేదలకు రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. పేదలు ఆకలితో అలమటించకూడదనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు.

click me!