దళిత బంధు కార్యక్రమం కాదు... ఓ ఉద్యమం: సీఎం కేసీఆర్

Arun Kumar P   | Asianet News
Published : Jul 26, 2021, 12:48 PM ISTUpdated : Jul 26, 2021, 01:03 PM IST
దళిత బంధు కార్యక్రమం కాదు... ఓ ఉద్యమం: సీఎం కేసీఆర్

సారాంశం

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకంపై అవగాహన సదస్సు ప్రగతి భవన్ లో ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా కేసీఆర్ దళిత సాధికారత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

హైదరాబాద్: దళిత బంధు ఓ కార్యక్రమం కాదు... ఉద్యమం అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.  తెలంగాణ ప్రభుత్వం దళిత సాధికారత కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేయాలని భావిస్తున్న దళిత బంధుపై ప్రగతి భవన్ లో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సు ప్రారంభమయ్యింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగుతున్న ఈ సదస్సులో మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీష్ రావుతో పాటు అధికారులు పాల్గొన్నారు. 

ఇక పైలట్ ప్రాజెక్ట్ గా దళిత బంధు హుజురాబాద్ నుండి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుండి 427 మంది దళితులు ఈ అవగాహన సదస్సుకు హాజరయ్యారు. దళిత బంధు అమలు, విధివిదానలపై  సీఎం ఈ సదస్సులో సీఎం వివరించనున్నారు. 

read more  నిరుపేదలకు అండా దండ... కేసీఆర్ నిలువెత్తు చిత్రపటానికి పాలాభిషేకం (వీడియో)

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.... ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం విజయవంతం అయ్యిందని గుర్తుచేశారు. ఇప్పుడు దళిత బంధు కూడా అలాగే విజయవంతం అవుతుందని... అక్కడక్కడా వ్యతిరేక శక్తులు వున్నా ఎదుర్కొని నిలబడతాం అన్నారు. దళిత బంధు కోసం లక్ష కోట్ల నిధులను అయినా ఖర్చు చేయడానికి సిద్దమన్నారు. ఆర్థికంగా పటిష్టం అయినపుడే దళితులు వివక్ష నుండి బయటపడతారని కేసీఆర్ పేర్కొన్నారు. 

ప్రస్తుతం దళిత అవగాన సదస్సులో పాల్గొన్నవారు భవిష్యత్ లో దళిత సమాజానికి అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ప్రతిభ గల దళితులను ఊరి చివరకు వుంచి ఉత్పాదక రంగాలకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దళారుల మోసాల నుండి దళితులు బయటపడాలని సూచించారు. 

దళిత బంధు విజయవంతమైతేనే దళితుల అభివృద్ధి చెందుతారని సీఎం అన్నారు. దళిత మహిళ మరిమమ్మ లాక్ డేత్ కేసులో పోలీసులను ఉద్యోగాల్లోంచి తీసేశాం... దళితుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్దికి ఇదే నిదర్శనమన్నారు సీఎం కేసీఆర్. దళితుల కోసం ఇంకా ఎంతో చేస్తామని...  తొలి ప్రయత్నమే ఈ దళిత బంధు అన్నారు. 

 

PREV
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!