దిశ నిందితుల ఎన్‌కౌంటర్: సిట్ అధికారిని విచారించిన సిర్పూర్కర్ కమిషన్

By narsimha lodeFirst Published Aug 27, 2021, 3:23 PM IST
Highlights

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది.ఈ నెల 26 నుండి 28 వరకు ఈ కేసులో 18 సాక్షులను విచారించనున్నట్టుగా కమిషన్ పేర్కొంది. ఎణ్‌కౌంటర్ లో పాల్గొన్న పోలీసులను కూడ కమిషన్ విచారించనుంది.

హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది.ఈ నెల 26 నుండి 28 వరకు ఈ కేసులో 18 సాక్షులను విచారించనున్నట్టుగా కమిషన్ పేర్కొంది. ఈ కేసులో సిట్ దర్యాప్తు అధికారిగా ఉన్న డీసీపీ నరేందర్ రెడ్డిని కమిషన్ విచారించింది.

ఎన్ ‌కౌంటర్ కు సంబంధించిన వివరాలతో పాటు సిట్ సమర్పించిన నివేదిక గురించి కమిషన్ ప్రశ్నించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు అధికారులను కూడ  కమిషన్ విచారించనుంది ఈ ఎన్‌కౌంటర్ లో మరణించిన నిందితుల కుటుంబసభ్యులను కూడ కమిషన్ విచారించి వివరాలు సేకరించనుంది.

 2019 డిసెంబర్ 6వ తేదీ ఉదయం దిశ హత్యకు గురైన చోటే ఈ నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌లో మరణించారు.  ఈ విషయమై సుప్రీంకోర్టు  విచారణకు కమిషన్ ఏర్పాటు చేసింది. కరోనా కారణంగా కమిషన్ విచారణ ఆలస్యమైంది. కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో  కమిషన్ మరోసారి విచారణను ప్రారంభించింది. 

 దిశపై అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో  అప్పటి సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్ కౌంటర్ పై ప్రజా సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఉన్నత న్యాయస్థాంన కమిషన్ ను ఏర్పాటు చేసింది. 
 

click me!