దిశ ఫ్యామిలీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నుండి పిలుపు

By narsimha lodeFirst Published Dec 8, 2019, 4:03 PM IST
Highlights

దిశ ఫ్యామిలీకి జాతీయ మానవ హక్కుల సంఘం నుండి పిలుపు వచ్చింది. దిశ ఫ్యామిలీ స్టేట్ మెంట్ ను కూడ ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రతినిధి బృందం సేకరించనుంది.

హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను విచారణ చేసేందుకు వచ్చిన జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులు దిశ కుటుంబసభ్యుల స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు.

ఈ నెల 6వ తేదీ ఉదయం దిశ‌ గ్యాంగ్ రేప్ నిందితులు చటాన్‌పల్లి వద్ద ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. ఈ ఘటనపై మీడియాలో వచ్చిన వార్తల‌పై జాతీయ మానవ హక్కుల సంఘం సుమోటోగా తీసుకొంది. తెలంగాణ పోలీసులకు నోటీసులు పంపింది.

ఈ నెల 7వ తేదీన తెలంగాణ దిశ గ్యాంగ్‌రేప్ నిందితుల మృతదేహాలను, ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులు సందర్శించారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనను జాతీయ మానవ హక్కుల సంఘం సుమోటోగా తీసుకోవడంపై జాతీయ మానవహక్కుల సంఘంపై దిశ ఫ్యామిలీ విమర్శలు ఎక్కుపెట్టింది. దిశ గ్యాంగ్‌రేప్, హత్య ఘటన విషయమై ఎందుకుజాతీయ మానవ హక్కుల సంఘం ఎందుకు స్పందించలేదని  దిశ తండ్రి ప్రశ్నించారు.

దిశ ఫ్యామిలీ కుటుంబసభ్యులను కూడ జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులు కలుసుకోవాలని భావించారు.ఈ మేరకు పోలీసులు దిశ ఫ్యామిలీకి సమాచారం ఇచ్చారు. శంషాబాద్‌లో ఉన్న దిశ ఫ్యామిలీకి పోలీసులు సమాచారం ఇచ్చారు.

దిశ తల్లి జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులకు రాలేదని దిశ తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె ఆరోగ్యం బాగా లేదని పోలీసులకు వివరించారు. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులను దిశ తండ్రి కలవనున్నారు.

గత నెల 27వ తేదీన జరిగిన ఘటనపై దిశ తండ్రి నుండి జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులు సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంది. 

click me!