దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎఫ్ఐఆర్: ఆ రోజు ఏం జరిగిందంటే...

By narsimha lode  |  First Published Dec 13, 2019, 12:53 PM IST

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎఫ్ఐఆర్ లో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. నిందితులు పోలీసులపై దాడికి ప్రయత్నించినట్టుగా పోలీసులు తెలిపారు. 


హైదరాబాద్: దిశపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన నిందితులు ఈ నెల 6వ తేదీ ఉదయం ఆరుగంటల పది నిమిషాలకు తిరగబడినట్టుగా పోలీసులు చెబుతున్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై ఎఫ్ఐఆర్ కాపీలో ఈ విషయాన్ని పోలీసులు ప్రకటించారు. 

ఈ నెల 6వ తేదీన దిశపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి, రేప్ చేసిన నలుగురు నిందితులు పోలీసుల కాల్పుల్లో మృతి చెందారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌‌పై  షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

Latest Videos

undefined

ఈ కేసులో ఎఫ్ఐఆర్ మేరకు  పలు విషయాలు వెలుగు చూశాయి. ఈ నెల 6వ తేదీన నిందితులను సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేసేందుకు నిందితులను చటాన్‌పల్లికి తీసుకొచ్చినట్టుగా ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

దిశ వస్తువులను రికవరీ చేసేందుకు నిందితులను చటాన్‌పల్లి అండర్ పాస్ బ్రిడ్జి వద్దకు వచ్చినట్టుగా ఎఫ్ఐఆర్‌లో తెలిపారు. చటాన్‌పల్లి అండర్ పాస్ బ్రిడ్జి వద్ద  ఈ నెల 6వ తేదీన ఉదయం చోటు చేసుకొన్న ఘటనలను ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

Also read:ఆ మృతదేహం దిశదే: డిఎన్ఏ రిపోర్ట్ ఇదీ...

ఈ నెల 6వ తేదీ ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు నిందితులు పోలీసులపై తిరగబడినట్టుగా పోలీసులు తెలిపారు. ఆయుధాలను లాక్కొని పోలీసులపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించినట్టుగా ఎఫ్ఐఆర్ లో పోలీసులు తెలిపారు.

Also read:దిశపై గ్యాంగ్‌రేప్, హత్య: తేల్చిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్...

ఆయుధాలను లాక్కొని  పోలీసులపై దాడి చేస్తే.... ఆత్మరక్షణకు కాల్పులు జరిపితే మృతి చెందినట్టుగా ఈ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. నిందితులు 19 ఏళ్లకు చెందినవారని ఎఫ్ఐఆర్ లో స్పష్టం చేశారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై  ఈ నెల 12వ తేదీన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మాజీ సుప్రీంకోర్టు జడ్జి చైర్మెన్‌గా ఉంటారు. సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్, రేఖ సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురు సభ్యుల బృందం ఆరు మాసాల్లో విచారణను పూర్తి చేసి నివేదికను ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

click me!