దిశపై గ్యాంగ్‌రేప్ జరిగిందని ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు తేల్చి చెప్పింది. ఈ నివేదిక సైబరాబాద్ పోలీసులకు శుక్రవారం నాడు అందింది.
హైదరాబాద్:గత నెల 27వ తేదీన శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి సర్వీస్ రోడ్డులో దిశపై నలుగురు నిందితులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి హత్య చేశారని ఫోరెన్సిక్ నివేదిక తేల్చింది. ఈ మేరకు పోరెన్సిక్ నివేదిక శుక్రవారం నాడు సైబరాబాద్ పోలీసులకు అందింది.
Also read::ఆ మృతదేహం దిశదే: డిఎన్ఏ రిపోర్ట్ ఇదీ...
గత నెల 27వ తేదీన తొండుపల్లి సర్వీస్ రోడ్డులో దిశపై నలుగురు నిందితులు పాశవికంగా గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి ఆ తర్వాత హత్య చేసిన 24 గంటల్లో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో ఈ నెల 6వ తేదీన చటాన్‌పల్లి అండర్ పాస్ బ్రిడ్జి వద్ద నిందితులు పోలీసులపై దాడికి పాల్పడి పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఆత్మరక్షణకు జరిపిన కాల్పుల్లో నిందితులు మృతి చెందిన విషయం తెలిసిందే.
దిశ గ్యాంగ్‌రేప్, హత్య ఘటనపై సైబరాబాద్ పోలీసులు సంఘటన స్థలంలో సేకరించిన సాక్ష్యాలను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కు పంపారు. దిశపై నలుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడినట్గుగా ఎఫ్ఎస్ఎల్ నివేదిక తేల్చింది.
చటాన్‌పల్లి అండర్‌పాస్ బ్రిడ్జి వద్ద కాలిన మృతదేహం నుండి సేకరించిన ఎముకలను ఎఫ్ఎస్‌ఎల్ ల్యాబ్‌కు పంపారు పోలీసులు. దిశ కుటుంబసభ్యుల డిఎన్ఏ రిపోర్టుతో కాలిన మృతదేహం నుండి సేకరించిన ఎముకలు సరిపోయాయి.
దీంతో కాలిన మృతదేహం దిశదేనని శాస్త్రీయంగా తేలింది. మరో వైపు దిశపై అత్యాచారం జరిగిందా లేదా అనే విషయమై సంఘటన స్థలంలో సేకరించిన లో దుస్తులు, ఇతర వస్తువులను పోలీసులు ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కు పంపారు. ఈ విషయమై పోరెన్సిక్ నివేదిక శుక్రవారం నాడు అందింది.
Also Read: దిశ నిందితుల ఎన్‌కౌంటర్: మృతదేహాల గురించి తేల్చని హైకోర్టు
ఈ నివేదికలో దిశపై గ్యాంగ్‌రేప్ చోటు చేసుకొందని తేలింది. ఈ రిపోర్టు పోలీసులకు అత్యంత కీలకమైందిగా పోలీసులు భావిస్తున్నారుదిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని గురువారం నాడు ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ ఆరు మాసాల్లో విచారణ పూర్తి చేసి నివేదికను సుప్రీంకోర్టుకు అందించనుంది.దిశ నిందితులను ఎన్‌కౌంటర్ పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన విచారణ కమిటీకి సైబరాబాద్ పోలీసులు నివేదికలను ఇచ్చే అవకాశం లేకపోలేదు.