Disha accused encounter: సిర్పూర్కర్ కమిషన్‌కి డ్రైవర్ వింత సమాధానాలు

By narsimha lode  |  First Published Oct 1, 2021, 9:52 AM IST

2019 డిసెంబర్ 6వ తేదీన దిశ నిందితుల ఎన్‌కౌంటర్ చోటు చేసుకొంది.ఈ ఎన్ ‌కౌంటర్ పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన 
 సిర్పూర్కర్ కమిషన్ ముందు నిందితులను సంఘటన స్థలానికి తీసుకెళ్లిన పోలీస్ వాహనం డ్రైవర్ యాదగిరి వింత సమాధానాలు చెప్పినట్టుగా తెలిసింది.
 


హైదరాబాద్:  ‘దిశ'  నిందితుల ఎన్‌కౌంటర్‌పై జస్టిస్‌ వీఎస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ (sirpurkar commission)విచారణ కొనసాగుతోంది. నిందితులను సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి కి తీసుకెళ్లిన సమయంలో  ఎన్‌కౌంటర్ చోటు చేసుకొంది. 

సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న  సమయంలో నిందితులు కానిస్టేబుళ్ల నుండి తుపాకులు తీసుకొని తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేశారని పోలీసులు గతంలో ప్రకటించారు. అయితే నిందితులను చటాన్ పల్లికి(chatanpally) తీసుకొచ్చిన పోలీస్ వాహనం డ్రైవర్   యాదగిరిని (drivier yadagiri)   జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ విచారించింది. 

Latest Videos

ఎన్‌కౌంటర్ సమయంలో మీకు బుల్లెట్ల శబ్దం వినిపించిందా?  అని డ్రైవర్‌ను ప్రశ్నించింది. అయితే ‘లేదు, ఆ సమయంలో తాను  వాహనంలోనే పడుకున్నానని అని డ్రైవర్‌ సమాధానమిచ్చినట్లు తెలిసింది. గురువారం నాడు త్రిసభ్య కమిషన్ (three men committee)యాదగిరిని విచారించింది. 

ఎన్‌కౌంటర్‌లో మరణించిన నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ కృపాల్‌ గుప్తా, (krupal gupta) బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ హెడ్‌ డాక్టర్‌ సుధీర్‌ గుప్తాలను  (sudheer gupta)కూడా కమిషన్‌ విచారించింది.మృతదేహాలకు పోస్ట్‌మార్టం ఎందుకు నిర్వహించలేదని కృపాల్‌ గుప్తాను ప్రశ్నించింది. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇవ్వలేదని పొంతనలేని సమాధానం చెప్పినట్లు తెలిసింది.  దిశ నిందితుల ఎన్‌కౌంటర్ 2019 డిసెంబర్ 6వ తేదీన చోటు చేసుకొంది. ఈ సమయంలో సైబరాబాద్ సీపీగా వీసీ సజ్జనార్ ను ఉన్నారు.  ఇటీవలనే సజ్జనార్ ను తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఎండీగా నియమించింది.

click me!