దిశ నిందితుల మృతదేహాలకు ముగిసిన రీపోస్ట్‌మార్టం: బంధువులకు అప్పగింత

By narsimha lode  |  First Published Dec 23, 2019, 2:52 PM IST

దిశ నిందితుల మృతదేహాలకు సోమవారం నాడు మధ్యాహ్నం గాంధీ ఆసుపత్రిలో రీ పోస్టుమార్టం పూర్తైంది.


గాంధీ ఆసుపత్రిలో దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం పూర్తయ్యింది. నాలుగు మృతదేహాలకు ముందుగా ఎక్స్‌రే తీసిన తర్వాత వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. 

అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. వారి వద్ద నుంచి సంతకాలు తీసుకున్న తర్వాత గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్ మృతదేహాలను సమర్పించారు. 2 అంబులెన్సుల్లో మృతదేహాలను మృతుల స్వస్థలాలకు తరలించారు. 

Latest Videos

Also Read:రీ పోస్టుమార్టం: దిశ నిందితుల డెడ్‌బాడీలకు నో ఎంబామింగ్

ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించిన వైద్యులు.. నివేదికను సీల్డ్ కవలర్‌లో సాయంత్రం హైకోర్టుకు సమర్పించనున్నారు. రీపోస్ట్‌మార్టం పూర్తవ్వడంతో మృతదేహాలను సాయంత్రం వారి కుటుంబసభ్యులకు అందజేయనున్నారు. 

ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుల బృందంచే రీ పోస్ట్‌మార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతకుముందు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్ మాట్లాడుతూ గతంలో పోస్ట్‌మార్టం చేసిన వైద్య బృందానికి సంబంధం లేకుండా రీ‌పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

Also Read:Year Roundup 2019: ఒక దిశ, ఒక హాజీపూర్.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన తెలంగాణ

ఇంతకంటే ఎక్కువ రోజులు మృతదేహాలను భద్రపరచలేమని గతంలోనే హైకోర్టు దృష్టికి తీసుకెళ్లామని ఆయన వెల్లడించారు. సీడీ, పెన్ డ్రైవ్ ద్వారా పోస్ట్‌మార్టం నివేదికను హైకోర్టుకు అందజేస్తామని శ్రవణ్ పేర్కొన్నారు.

 మరోవైపు నిందితుల మృతదేహాలకు ఎంబామింగ్ ఏమి జరగలేదని.. 2 నుంచి 4 రోజుల పాటు రీఫ్రిజిరేటర్‌లో పెట్టామన్నారు. ఇప్పటికే మృతదేహాలు 50 శాతానికి పైగా డీ కంపోజ్ అయ్యాయని శ్రవణ్ తెలిపారు.

click me!