బస్సులో పర్సు పోగొట్టుకుంది.. అదే ఆమె ప్రాణాలు కాపాడింది..

By SumaBala BukkaFirst Published Dec 26, 2022, 9:02 AM IST
Highlights

బస్సులో ఓ యువతి పర్సు పోగొట్టుకుంది. అందులో ఉన్న సూసైడ్ లెటర్ ఆ యువతి ప్రాణాలు కాపాడింది. 

సంగారెడ్డి : బస్సులో పర్సు పోగొట్టుకోవడం చాలామందికి ఎదురయ్యే అనుభవమే. దీనివల్ల డబ్బులు ఇతర ముఖ్యమైన వస్తువులు పోయి.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే అలా పోగొట్టుకున్న ఓ పర్సు… ఓ అమ్మాయి ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం పటాన్చెరులో ఓ యువతి ఆర్టీసీ బస్సు ఎక్కింది. సికింద్రాబాదులోని జేబీఎస్ లో దిగిపోయింది. అదే లాస్ట్ స్టాప్ కావడంతో ప్రయాణికులందరూ దిగిపోయారు. ఆ తర్వాత బస్సులో కండక్టర్ రవీందర్ కు ఓ పర్సు కనిపించింది. 

అది ఎవరిదో చూద్దామని పర్సు తెరవగా అందులో 403 రూపాయలు కనిపించాయి. దాంతోపాటు ఓ లెటర్ కూడా ఉంది. అందులో రాసి ఉంది చదివి కండక్టర్ షాక్ అయ్యాడు. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని.. అందుకే చనిపోవాలని అనుకుంటున్నానని ఆ లెటర్ లో యువతి రాసుకుంది. వెంటనే పర్స్ మొత్తం వెతికితే యువతి ఆధార్ కార్డు లభించింది. ఆ కండక్టర్ వెంటనే ట్విట్టర్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. సూసైడ్ లెటర్ ను ఆధార్ కార్డు లో పోస్ట్ చేశాడు.

ఆస్తి తన పేర రాయనన్నాడని.. భర్తను గొంతు నులిమి చంపిన భార్య..

సజ్జనార్ వెంటనే స్పందించారు. వెంటనే ఆ యువతిని గుర్తించాలని ఆర్టీసీ సిబ్బందిని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఆర్టీసీ ఎస్ఐ దయానంద్, మారేడ్పల్లి పోలీసుల సహకారంతో చివరికి ఆమెను గుర్తించారు.  యువతి కుటుంబ సభ్యులకు అప్పగించారు. విషయం తెలియగానే వెంటనే స్పందించి.. అమ్మాయి ప్రాణాలను కాపాడడానికి తీవ్రంగా ప్రయత్నించిన సిబ్బందితో పాటు.. విషయం తెలియగానే ఆలస్యం చేయకుండా  ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ ఎండీ అప్రమత్తం చేసిన కండక్టర్ రవీందర్ ను..  ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ లు అభినందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 

click me!