కాంగ్రెస్ పార్టీ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరామ్ రమేష్ లకు బుధవారం నాడు రేవంత్ రెడ్డి తన నివాసంలో అల్పాహర విందు ఇచ్చారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్ లకు బుధవారం నాడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైద్రాబాద్ లోని తన నివాసంలో అల్పాహర విందు ఇచ్చారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏర్పాట్లపై చర్చించేందుకు గాను కాంగ్రెస్ నేతలు మంగళవారం నాడు హైద్రాబాద్ కు చేరుకున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై చర్చించారు. ఈ సమావేశం పూర్తైన తర్వాత రాత్రికి కాంగ్రెస్ నేతలు ఇక్కడే ఉన్నారు. ఇవాళ ఉదయం జైరామ్ రమేష్,దిగ్విజయ్ సింగ్ లతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలకు రేవంత్ రెడ్డి తన నివాసంలో అల్పాహర విందు ఇచ్చారు.బ్రేక్ పాస్ట్ పూర్తైన తర్వాత రాష్ట్రంలో భారత్ జోడో యాత్రపై చర్చించారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ యాత్రను విజయవంతం చేసే విషయమై చర్చించారు.
ఈ నెల 24వ తేదీన కర్ణాటక నుండి తెలంగాణలోకి ప్రవేశించనుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల గుండా యాత్ర సాగనుంది. తెలంగాణ నుండి మహరాష్ట్రలోకి పాదయాత్ర ప్రవేశించనుంది.
ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన రాహుల్ గాంధీ తమిళనాడులోని కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. కన్యాకుమారి నుండి జమ్మూ కాశ్మీర్ వరకు రాహుల్ యాత్ర సాగనుంది. నిన్న, ఇవాళ యాత్రకు విరామం ప్రకటించారు. రేపు రాహుల్ గాంధీ యాత్రలో ఎఐసీసీ చీఫ్ సోనియా గాంధీ కూడ పాల్గొంటారు.
also read:టీఆర్ఎస్‌కు బీఆర్ఎస్ కాదు.. వీఆర్ఎస్ ఇవ్వాలి : కేసీఆర్ కొత్త జాతీయ పార్టీపై జైరాం రమేశ్ సెటైర్లు
ప్రస్తుతం ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను కూడ విడుదల చేశారు. ఎఐసీసీ అధ్యక్ష పదవికి మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ లు పోటీ చేస్తున్నారు. ఈ దఫా అధ్యక్ష పదవికి జరిగే పోటీలో గాంధీ కుటుంబం దూరంగా ఉంది.
భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఆయా రాష్ట్రాల్లోని పార్టీ క్యాడర్ లో ఉత్తేజం నింపేందుకు ఈ యాత్ర దోహదపడనుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది.దేశంలో ప్రజలు ఎదదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని రానున్న రోజుల్లో వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకొంటామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పాదయాత్ర సందర్భంగా తమ దృష్టికి వచ్చిన అంశాలపై అధ్యయనం చేసి వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోలో చేర్చే విషయమై కాంగ్రెస్ పార్టీ పరిశీలించనుంది.