చేరనని తొలుత లేఖ: ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరుతానని ట్విస్టిచ్చిన డీఎస్

By narsimha lodeFirst Published Mar 26, 2023, 10:35 AM IST
Highlights

తాను  కాంగ్రెస్ పార్టీలో  చేరుతున్నానని  మాజీ మంత్రి డి. శ్రీనివాస్ ప్రుకటించారు.  కాంగ్రెస్ పార్టీలో  చేరేందుకు  తాను  గాంధీ భవన్ కు చేరినట్టుగా  డి.శ్రీనివాస్ తెలిపారు. 

హైదరాబాద్:  తాను  కాంగ్రెస్ పార్టీలో  చేరుతున్నానని  మాజీ మంత్రి డి.శ్రీనివాస్ ప్రకటించారు.  చాలా రోజుల తర్వాత  తాను  గాంధీ భవన్ కు  రావడం  సంతోషంగా  ఉందని  ఆయన  చెప్పారు. ఆదివారం నాడు  ఓ తెలుగు న్యూస్ చానెల్ కు  డి.శ్రీనివాస్ ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత  తన స్వంత ఇంటికి వచ్చిన దాని కంటే  ఎక్కువ సంతోషంగా  ఉందని  డి.శ్రీనివాస్ చెప్పారు.  

కాంగ్రెస్ పార్టీలో  చేరడం లేదని లేఖ రాసిందెవరని  ఆయన ప్రశ్నించారు. ఇవాళ  ఉదయం  కూడా  డి.శ్రీనివాస్  కాంగ్రెస్ పార్టీలో  తాను  చేరడం లేదని  ప్రకటించినట్టుగా  మీడియాలో వార్తలు వచ్చాయి.   ఆ తర్వాత    కాంగ్రెస్ పార్టీలో  చేరుతున్నట్టుగా  డి.శ్రీనివాస్  ప్రకటించారు. డి.శ్రీనివాస్ తో పాటు  ఆయన  పెద్ద కొడుకు  సంజయ్ కూడా  ఇవాళ  కాంగ్రెస్  పార్టీలో  చేరనున్నారు.  

ఇవాళ  ఉదయం  కాంగ్రెస్ పార్టీలో  డి,శ్రీనివాస్ చేరిక విషయమై  మీడియాకు  ప్రెస్ నోట్ విడుదలైంది.  ఈ ప్రెస్ నోట్ లో   కాంగ్రెస్ పార్టీలో  చేరుతున్నట్టుగా  వచ్చిన  వార్తలను  ఆయన  ఖండించార.  క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన  ఆ ప్రెస్ నోట్ లో  పేర్కొన్నారు.  
తన కుమారుడు  సంజయ్ తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నారని ఆయన ప్రకటించారు. . ఆయనను అభినందిస్తున్నట్టుగా  పేర్కొన్నారు.   ఆరోగ్యం సహకరిస్తే గాంధీభవన్ వరకు వెళ్లి ఆశీర్వదిస్తానని డీఎస్  ప్రకటించారు.  ఇప్పటికే చిన్న కుమారుడు అరవింద్ బిజెపి ఎంపీగా ప్రజాదరణ పొందాదన్నారు..ఇద్దరు కుమారులు ప్రజాసేవలో రాణించి పేరు తెచ్చుకుంటారని  ఆశిస్తున్నానని  డీఎస్  ఆకాంక్షణు వ్యక్తం  చేశారు.  ప్రజా క్షేత్రంలో ఉన్నవారికి ప్రజలే ముఖ్యమని ఆయన   ఆ లేఖలో  పేర్కొన్నారు. 

ఈ లేఖ మీడియాకు విడుదల చేసిన  కొద్ది సేపటికే  గాంధీ భవన్ కు  పెద్ద కొడుకు  సంజయ్ తో కలిసి డి.శ్రీనివాస్ గాంధీ భవన్ కు  చేరుకున్నారు.  ఈ సందర్భంగా  డి.శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.  తాను కాంగ్రెస్ పార్టీలో  చేరనున్నట్టుగా  తెలిపారు. 

గద కొంతకాలంగా  కాంగ్రెస్ పార్టీలో  డి.శ్రీనివాస్ చేరే అవకాశం ఉందని  ప్రచారం సాగుతుంది.  ఈ విషయమై  డి.శ్రీనివాస్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో  కూడా  న్యూఢిల్లీలో భేటీ అయ్యారు.  అయితే డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో  చేరికను  నిజామాబాద్  జిల్లాకు  చెందిన కాంగ్రెస్ నేతలు  తీవ్రంగా  వ్యతిరేకించారు. పార్టీని  కష్టకాలంలో  వీడి వెళ్లిన  డి.శ్రీనివాస్ ను  పార్టీలో చేర్చుకొనే విషయమై  తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ విషయమై రాష్ట్ర నాయకత్వం  జిల్లా నేతలతో  చర్చించింది.ఈ కారణంగానే  డి.శ్రీనివాస్ ఆయన తనయుడు సంజయ్ కాంగ్రెస్ లో  చేరిక ఆలస్యమైందనే ప్రచారం గాంధీభవన్ వర్గాల్లో సాగుతుంది. 

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో  మాజీ మంత్రి డి.,శ్రీనివాస్, ఆయన తనయుడు  సంజయ్ లు  కాంగ్రెస్ లో  చేరనున్నారు.  2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు  డి.శ్రీనివాస్ పై  ఉమ్మడి నిజామాబాద్  జిల్లాకు  చెందిన కాంగ్రెస్ నేతలు  కేసీఆర్ కు  ఫిర్యాదు చేశారు. దీంతో  బీఆర్ఎస్  కార్యక్రమాలకు దూరంగా  ఉంటున్నారు.  తనపై   పార్టీ నేతలు  చేసిన ఫిర్యాదుపై  కేసీఆర్ తో చర్చించేందుకు  డి.శ్రీనివాస్ ప్రయత్నించారు. కానీ కేసీఆర్ ఆయనకు అపాయింట్‌మెంట్  ఇవ్వలేదు.

దీంతో  డి.శ్రీనివాస్ కాంగ్రెస్, బీజేపీలలో  చేరుతారనే ప్రచారం సాగింది.  కేంద్ర మంత్రి అమిత్ షాతో కూడా  డి.శ్రీనివాస్ గతంలో భేటీ అయ్యారు.ఆ సమయంలో  డి.శ్రీనివాస్  బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారనే  ప్రచారం సాగింది. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ నేతలతో  సన్నిహితంగా  మెలిగారు. సోనియాతో కూడా  సమావేశమయ్యారు.

also read:డీఎస్ చొరవ: ధర్మపురి సంజయ్ నేడు కాంగ్రెస్‌లో చేరిక

దీంతో డి.శ్రీనివాస్  కాంగ్రెస్ పార్టీలో  చేరికకు గ్రీన్ సిగ్నల్  లభించిందనే  ప్రచారం కూడా సాగింది. సోనియాను కలిసిన చాలా రోజుల తర్వాత డి.శ్రీనివాస్ ఇవాళ గాంధీభవన్ మెట్లెక్కారు. పార్టీలో  చేరనున్నారు. డి.శ్రీనివాస్ చిన్న కొడుకు  అరవింద్   బీజేపీలో  ఉన్నారు. అరవింద్ నిజామాబాద్ ఎంపీగా  ప్రాతినిథ్యం  వహిస్తున్నాడు. 

click me!