డీఎస్ చొరవ: ధర్మపురి సంజయ్ నేడు కాంగ్రెస్‌లో చేరిక

Published : Mar 26, 2023, 09:47 AM IST
 డీఎస్  చొరవ: ధర్మపురి సంజయ్  నేడు  కాంగ్రెస్‌లో  చేరిక

సారాంశం

ధర్మపురి సంజయ్  ఇవాళ  కాంగ్రెస్ పార్టీలో  చేరనున్నారు. సంజయ్ కాంగ్రెస్ పార్టీలో  చేరిక సందర్భంగా  డీఎస్ గాంధీ భవన్ కు వెళ్లే అవకాశం ఉంది.

హైదరాబాద్:  మాజీ  మంత్రి ధర్మపురి శ్రీనివాస్ తనయుడు  ధర్మపురి సంజయ్  ఆదివారంనాడు  కాంగ్రెస్ పార్టీలో  చేరేున్నారు. ఆదివారంనాడు గాంధీభవన్ లో  జరిగే  కార్యక్రమంలో  టీపీసీసీ చీఫ్  రేవంత్  రెడ్డి సమక్షంలో  ధర్మపురి సంజయ్  కాంగ్రెస్ పార్టీలో  చేరనున్నారు.  సంజయ్  కాంగ్రెస్ పార్టీలో  చేరడాన్ని  ఉమ్మడి నిజామాబాద్  జిల్లాకు  చెందిన  కాంగ్రెస్ నేతలు  తీవ్రంగా  వ్యతిరేకించారు. దీంతో  ధర్మపురి శ్రీనివాస్ రంగంలోకి దిగారు. సంజయ్ ను  కాంగ్రెస్ పార్టీలో  చేర్చుకొనేలా కాంగ్రెస్ పార్టీ నేతలను ఒప్పించగలిగారు. దీంతో  కాంగ్రెస్ పార్టీలో  సంజయ్ చేరికకు  కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా నాయకులు  కూడా  అంగీకరించారు.  మరో వైపు   కాంగ్రెస్ పార్టీలో  ధర్మపురి  శ్రీనివాస్ కూడా  చేరుతారనే  ప్రచారం  సాగింది.  అయితే ధర్మపురి  సంజయ్  కాంగ్రెస్ పార్టీలో  చేరిక సందర్భాన్ని  పురస్కరించుకొని  ఇవాళ డి.శ్రీనివాస్ గాంధీ భవన్ కు  వెళ్లనున్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!