తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు తీరుపై తీవ్ర విమర్శలు.. అసలేం జరిగిందంటే..

By Sumanth KanukulaFirst Published Sep 26, 2022, 1:38 PM IST
Highlights

తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో శ్రీనివాసరావు ఖమ్మంలో క్షుద్రపూజలు చేశారని ఆరోపణలువచ్చాయి. అయితే వాటిని శ్రీనివాసరావు ఖండించారు. తాను గిరిజన పూజలు మాత్రమే చేశానని ఆయన వివరణ ఇచ్చారు. అయితే తాజాగా శ్రీనివాసరావు తీరు మరోసారి వివాదస్పదమైంది.

తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో శ్రీనివాసరావు ఖమ్మంలో క్షుద్రపూజలు చేశారని ఆరోపణలువచ్చాయి. అయితే వాటిని శ్రీనివాసరావు ఖండించారు. తాను గిరిజన పూజలు మాత్రమే చేశానని ఆయన వివరణ ఇచ్చారు. అయితే తాజాగా శ్రీనివాసరావు తీరు మరోసారి వివాదస్పదమైంది. కొత్తగూడెం శ్రీనగర్ కాలనీ డీఎస్‌ఆర్ క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో శ్రీనివాసరావు  పాల్గొన్నారు. అయితే బతుకమ్మ వేడుకల్లో  సినిమా పాటలకు శ్రీనివాసరావు తీన్మార్ స్టెప్పులేయడం విమర్శలకు కారణమైంది. పవిత్రమైన పండగ సంబరాల్లో ఇలాంటి పనులేంటని విమర్శిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ఆయన తూట్లు పొడుస్తున్నారని మండిపడుతున్నారు. 

ఇక, గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలంలోని జిమ్నా తండాలో నిర్వహించిన పూజల్లో డీహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. తనను తాను దేవతగా చెప్పుకుంటున్న సుజాత నగర్ ఎంపీపీ విజయలక్ష్మితో కలిసి పూజల్లో పాల్గొన్న శ్రీనివాసరావు.. మంటల్లో నిమ్మకాయులు వేస్తున్న వీడియో కూడా బయటకువచ్చింది. ఆయన ఎంపీపీ చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశారు. ఈ విషయం బయటకు రావడంతో డీహెచ్‌ శ్రీనివాస్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. 

అయితే తాను గిరిజన పూజలు మాత్రమే చేశానని డీహెచ్ శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. స్థానికుల ఆహ్వానం తోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్​ మండలంలో జరిగిన పూజ కార్యక్రమానికి వెళ్లినట్లు చెప్పారు. తాను మూఢ నమ్మకాలను అసలే విశ్వసించనని చెప్పారు. 
 

click me!