బీజేపీ డైరెక్షన్‌లోనే జగన్, షర్మిల.. వైఎస్‌ కూతురు అయితే తిడితే ఊరుకుంటామా?: జగ్గారెడ్డి

Published : Sep 26, 2022, 12:58 PM IST
బీజేపీ డైరెక్షన్‌లోనే జగన్, షర్మిల.. వైఎస్‌ కూతురు అయితే తిడితే ఊరుకుంటామా?: జగ్గారెడ్డి

సారాంశం

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. షర్మిలకు రాజకీయ అవగాహన లేదని అన్నారు. షర్మిల అడుగడుగునా మాట మారుస్తున్నారని మండిపడ్డారు.

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. షర్మిలకు రాజకీయ అవగాహన లేదని అన్నారు. షర్మిల అడుగడుగునా మాట మారుస్తున్నారని మండిపడ్డారు. షర్మిల గతంలో జగన్ వదిలిన బాణంఅని.. ఇప్పుడు వైఎస్సార్ వదిలిన బాణం అని చెబుతున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. షర్మిల బాణాలను మార్చినప్పుడు.. తాము అనకూడదా? అని ప్రశ్నించారు. తండ్రి పేరును వాడుకుని నాయకులు కావాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. షర్మిల అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. 

రాజశేఖరరెడ్డి కూతురు అయితే మాత్రం తిడితే ఊరుకుంటామా అని ప్రశ్నించారు. షర్మిల బీజేపీ బాణం అని తనకు అనుమానంగా ఉందన్నారు. షర్మిల బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. బీజేపీ డైరెక్షన్‌లో వైఎస్ జగన్, షర్మిల పనిచేస్తున్నారని ఆరోపించారు. 

Also Read: అయ్యా జగ్గయ్య ఇంతకీ నువ్వే పార్టీ : జగ్గారెడ్డిపై వైఎస్ షర్మిల సెటైర్లు

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని వైఎస్ కోరుకున్నారని జగ్గారెడ్డి చెప్పారు. పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టింది వైఎస్సారేనని అన్నారు. టీఆర్ఎస్‌లో ఉన్న తనను కాంగ్రెస్‌లోకి తెచ్చింది వైఎస్సారేనని గుర్తుచేశారు. వైఎస్‌పై తమకు అభిమానం ఉందని.. జగన్, షర్మిలకు లేదని ఆరోపించారు. షర్మిల తమను తిట్టడం కాదని.. ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని సూచించారు. 

ఇక, సంగారెడ్డి నియోజకవర్గంలో షర్మిల మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే జగ్గారెడ్డి అట, ఈయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించారు. మొదట టీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్ అంటూ షర్మిల చురకలు వేశారు. రోజో పార్టీ మారితే ఎలా జగ్గారెడ్డి అని ఆమె సెటైర్లు వేశారు. తాను బీజేపీ వదిలిన బాణం అన్నారు ఈ జగ్గయ్య.. అయ్యా జగ్గయ్య, తాను బీజేపీ వదిలిన బాణం కాదన్నారు. తాను వైఎస్సార్ వదిలిన బాణమని ఆమె పేర్కొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Drunk & Drive Test in Ramagundam: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు| Asianet News Telugu
Hyderabad : జీరో మైలురాయి ఎక్కడుంది.. హైదరాబాద్ దూరాన్ని ఎక్కడినుండి కొలుస్తారో తెలుసా..?