మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలి, అరెస్టు చేయాలి.. పెరుగుతున్న డిమాండ్...

By AN TeluguFirst Published Oct 20, 2021, 8:23 AM IST
Highlights

మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని గొర్రెల కాపరుల సంఘ నేతలు హెచ్చరించారు. 

హనుమకొండ :   తమను కించపరిచే విధంగా మాట్లాడిన  సినీ నటుడు మంచు మోహన్ బాబు పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో  గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం GMPS  నేతలు ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల సందర్భంగా తోడినటులను ఉద్దేశించి ‘ఈ కాలంలో గొర్రెల కాపరుల వద్దా సెల్ ఫోన్లు ఉన్నాయి.  ప్రపంచంలో ఏం జరుగుతుందో వారు కూడా తెలుసుకుంటున్నారు.’ అని Shepherdsను కించపరిచేలా Manchu Mohan Babuమాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని గొర్రెల కాపరుల సంఘ నేతలు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్లో సంఘ నేతలు  ఏ మల్లేష్,  కందుకూరు లో చిందం అంజయ్య,  వరంగల్ జిల్లా నర్సంపేట పోలీస్స్టేషన్లో సంఘం జిల్లా కార్యదర్శి పరిగి మధుకర్,  మహబూబాద్ జిల్లా డోర్నకల్ లో ఉప్పనపల్లి శ్రీనివాస్,  తొర్రూర్ లో  బొల్లం అశోక్,  హనుమకొండ జిల్లా ఆత్మకూరులో  ముద్దం  సాంబయ్య  ఫిర్యాదులు అందజేశారు. 

ఇదిలా ఉండగా, అక్టోబర్ 16 న జరిగిన మంచు విష్ణు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మోహన్ బాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు. Mohan babu ఎన్నికలు జరిగిన తీరు, ప్రత్యర్థుల కామెంట్స్ ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మేము ఇంత మంది ఉన్నాం.. అంత మంది ఉన్నాం అని కొందరు ఓటర్లను బెదిరించారు. అయినా, మా సభ్యులు మా ఓటు మా ఇష్టం అని ధైర్యంగా Manchu vishnuకు ఓటేశారు. ఓటు వేయని వారిమీద పగ పెంచుకోవద్దని మోహన్ బాబు హితవు పలికారు. 

రాగద్వేషాలు వదిలి కళాకారులందరూ ఒక్కటిగా ఉండాలి. మంచు విష్ణు కంటే సీనియర్ హీరోలు, అతని తోటి హీరోలు సహాయసహకారాలు అందించాలని కోరుకుంటున్నా అని మోహన్ బాబు తెలియజేశారు. మంచు విష్ణు మంచి నటుడు, హీరో... అలాగే భారత దేశం గర్వించదగ్గ రీతిలో మా కీర్తిని పెంచుతాడని విశ్వాసంతో చెబుతున్నా అన్నారు. మంచు విష్ణు పెద్ద పెద్ద ప్రామిస్ లో చేశాడు. వాటి అమలు అంత సులభం కాదు. అందుకే నటులందరి సహకారం మంచు విష్ణుకు ఉండాలి అన్నారు. 

మొదటిగా కేసీఆర్ అప్పాయింట్ తీసుకొని ఆయనను కలుస్తాను. సీఎం కేసీఆర్ గారు చేతల మనిషి... KCR మా సభ్యుల సంక్షేమానికి సహాయసహకారాలు ఖచ్చితంగా అందిస్తారన్న నమ్మకం ఉందని మోహన్ బాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ తరువాత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తా అన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి పేర్ని నానిని ఆహ్వానించామని, ఆయన పండుక కావడంతో రాలేకపోయారు అన్నారు. 

జగన్ పై టీడీపీ బూతు వ్యాఖ్యలు.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి : సజ్జల రామకృష్ణా రెడ్డి

Chiranjeevi ఫ్యామిలీని ఉద్దేశిస్తూ మోహన్ బాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాములు కూడా చీమల చేతిలో చేస్తాయి. మేము గొప్ప అని రెచ్చగొడితే చిన్నవాళ్లు కూడా తిరగబడతారు. రోజూ వారి నటుడు కూడా తిరిగి దాడి చేస్తాడు. కాబట్టి మనమే గొప్ప అనుకోకూడదు అంటూ.. పరోక్షంగా చురకలు వేశారు.  

ఇక MAA సభ్యులను ఉద్దేశిస్తూ మీకు సమస్య ఉంటే అద్యక్షుడికి చెప్పండి. టీవీలకు ఎక్కొద్దు. మీడియా ముందు మాట్లాడుకొని జనాలను ఎంటర్టైన్ చేయొద్దు. మనం నటించి ఎంటర్టైన్ చేయాలి కానీ.. ఇలా మీడియా ముందు తిట్టుకొని కాదు అన్నారు. ఇక  చిత్రపురి కాలనీ కొందరు కాజేయాలని చూస్తే గవర్నర్ రంగరాజన్ లేఖ రాసి పోరాడి దానిని కాపాడుకున్నట్లు తెలియజేశారు. 

ఎన్నికలలో మంచు విష్ణు గెలుపుకు కారణం నరేష్ అంటూ.. ఆయనపై ప్రశంసంలు కురిపించారు. నరేష్ తో ఎటువంటి అనుబంధం లేకపోయినా, రెండు నెలలు మావెంటే ఉంటూ.. విజయానికి కారణం అయ్యారు అన్నారు.

click me!