తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై 30.3 శాతం మంది ఓటర్లు ఆగ్రహంగా ఉన్నట్టు ఐఏఎన్ఎస్-సీవోటర్ సర్వే పేర్కొంది. దేశంలో అధిక ఆగ్రహం ఈయనపైనే వెల్లడైందని వివరించింది. బీజేపీ రాష్ట్రంలో బలపడటానికి ఈ అవకాశం కలిసి రావచ్చని తెలిపింది. ఈ ఆగ్రహం నుంచి బయటపడాలంటే కేసీఆర్ సీఎం పదవిని కొడుకు కేటీఆర్‌కు అప్పజెప్పడం ఉత్తమమని సీవోటర్ ఫౌండర్ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: దేశంలో ప్రజల నుంచి అధిక ఆగ్రహం ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఓ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో 30.3 శాతం మంది ఓటర్లు CM KCRపై ఆగ్రహంగా ఉన్నట్టు తెలిపింది. ఐఏఎన్ఎస్-సీవోటర్‌లు దేశవ్యాప్తంగా సర్వే చేసి వివరాలు విడుదల చేసింది. Andhra Pradesh ముఖ్యమంత్రిపైనా ఆగ్రహం ఎక్కువగానే ఉన్నట్టు ఈ సర్వే పేర్కొంది. ఇందులో బెస్ట్ పర్మార్మెన్స్ సీఎంగా ఛత్తీస్‌గడ్ సీఎం భుపేశ్ బఘేల్ నిలిచారు.
Telanganaలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అధిక ఆగ్రహం ఉండటం, కేంద్ర ప్రభుత్వంపై గుడ్ రేటింగ్స్ వంటి కారణాలతో ఈ రాష్ట్రంలో BJP నిలదొక్కుకునే అవకాశముందని సీవోటర్ వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్‌ముఖ్ వివరించారు. ఈ సమయంలో కేసీఆర్ సీఎం పీఠం వదిలి కేటీఆర్‌కు అప్పజెప్పడం సముచితమని పేర్కొన్నారు. పరిస్థితులు చేజారిపోకముందే ఈ నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పునాదులు పటిష్టపరుచుకోవడానికి బీజేపీ శతవిధాల ప్రయత్నిస్తున్నది. ఇప్పుడిప్పుడే ఆ పార్టీకి ఆదరణ పెరుగుతున్నది. ఇలాంటి సందర్భంలో టీఆర్ఎస్ అధినేతపై ఆగ్రహావేశాలు పెరగడం దానికి కలిసి వచ్చే అంశమని సర్వే పేర్కొంది.
undefined
Also Read: దళిత బంధు కొనసాగుతుంది.. ఏది మొదలుపెట్టినా సాధించి చూపించాం: సీఎం కేసీఆర్
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌పైనా 28.1శాతం ఓటర్ల ఆగ్రహమున్నట్టు ఈ సర్వే వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది తొలినాళ్లలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో యూపీ సీఎం యోగిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడం బీజేపీకి కలతపెట్టే విషయమే.
కాగా, సీఈవో స్టైల్ పాలన చేస్తున్న చత్తీస్‌గడ్ సీఎం భుపేశ్ బఘేల్ అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఈ సర్వే పేర్కొంది. కాగా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కేవలం 10.1శాతం ఓటర్ల ఆగ్రహంతో రెండో ఉత్తమ ముఖ్యమంత్రిగా ఉన్నట్టు వివరించింది. రాష్ట్రాలు సహా కేంద్రపాలిత ప్రాంతాలను 115 ప్యారామీటర్లలో కొలిచి ఈ సర్వే రూపొందించారు.