భారీ వర్షాలతో చల్లబడ్డ తెలంగాణ... రికార్డు స్థాయిలో పడిపోయిన విద్యుత్ డిమాండ్

By Arun Kumar PFirst Published Oct 13, 2020, 12:29 PM IST
Highlights

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ అధికారులు, ఇంజనీర్స్ తో మాట్లాడిన సిఎండి అప్రమత్తంగా వుండాలని సూచించారు.

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో వాతావరణం చల్లబడి విద్యుత్ వినియోగం భారీగా తగ్గింది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో విద్యుత్ డిమాండ్ 12 వేల మెగా వాట్స్ నుండి 4300 మెగావాట్స్ పడిపోయినట్లు ట్రాన్స్ కో, జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు వెల్లడించారు. డిమాండ్ తగ్గడంతో వోల్టేజ్ పెరిగిందని... దీంతో అప్రమత్తంగా వుండాలని విద్యుత్ అధికారులకు సూచించారు. 

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ అధికారులు, ఇంజనీర్స్ తో మాట్లాడిన సిఎండి అప్రమత్తంగా వుండాలని సూచించారు. విద్యుత్ డిమాండ్ తగ్గినప్పటికి 15 వందల మెగా వాట్స్  హైడల్ విద్యుత్ ఉత్పత్తి యధావిధిగా కొనసాగుతోందన్నారు. 

విద్యుత్ డిమాండ్ లో హెచ్చుతగ్గుల నేపథ్యంలో  రాత్రి నుండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తు లోడ్ డిస్స్పాచ్ చేయిస్తున్నామన్నారు. విద్యుత్ డిమాండ్ తగ్గడం థర్మల్ యూనిట్స్ అన్ని బ్యాక్ డౌన్ చేశామని ఆయన తెలిపారు. 

వర్షం నీరు నిల్వ వున్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంస్థ కు తెలియజేయాలన్నారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడిన ,సెల్లార్ లకు నీళ్లు వచ్చినా దయచేసి ప్రజలు స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు (నంబర్లు 1912/100)   ఫోన్ చేయాలని ప్రభాకరరావు సూచించారు. 

 

click me!