గుడ్‌న్యూస్: వచ్చే ఏడాదిలో కరోనా వ్యాక్సిన్ తేల్చేసిన కేంద్ర మంత్రి

Published : Oct 13, 2020, 12:23 PM IST
గుడ్‌న్యూస్: వచ్చే ఏడాదిలో కరోనా వ్యాక్సిన్ తేల్చేసిన కేంద్ర మంత్రి

సారాంశం

వచ్చే ఏడాది ఆరంభంలోనే కరోనా వ్యాక్సిన్ దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు.  

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆరంభంలోనే కరోనా వ్యాక్సిన్ దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు.

ఈ వ్యాక్సిన్ ను ఎలా పంపిణీ చేయాలనే దానిపై నిపుణులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారని ఆయన చెప్పారు.వచ్చే ఏడాది ఆరంభంలోనే  వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నామన్నారు.

కరోనా వ్యాక్సిన తయారీ కోసం ప్రపంచంలోని పలు సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. కొన్ని సంస్థల క్లినికల్ ట్రయల్స్ చివరి దశకు చేరుకొన్నాయి. భారత్ కు చెందిన పరిశోధన సంస్థలు కూడ ఈ వ్యాక్సిన్ కోసం విస్తృతంగా పరిశోదనలు చేస్తున్నాయి. ఈ పరిశోధనలు చివరి దశలో ఉన్నట్టుగా కొన్ని సంస్థలు ప్రకటించిన విషయం తెలిసిందే.

దేశంలో కరోనా కేసుల సంఖ్య 71 లక్షలకు  చేరుకొంది. దేశంలో కరోనా కేసులు మంగళవారం నాటికి 71 లక్షల 75 వేల881కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లో 8 లక్షల 38 వేల 729 కేసులు నమోదయ్యాయి.  ఇప్పటివరకు కరోనా సోకిన వారిలో 62లక్షల 27 వేల 296 మంది కోలుకొన్నారు. కరోనాతో 1 లక్ష, 09 వేల 856 మంది మరణించినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.
 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?