ఢిల్లీ లిక్కర్ స్కామ్.. వరుసగా రెండో రోజు ఈడీ కార్యాలయానికి కవిత ప్రతినిధి సోమా భరత్..

Published : Mar 29, 2023, 01:02 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్.. వరుసగా రెండో రోజు ఈడీ కార్యాలయానికి కవిత ప్రతినిధి సోమా భరత్..

సారాంశం

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరఫు న్యాయవాది సోమా భరత్‌ వరుసగా రెండో రోజు ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరఫు న్యాయవాది సోమా భరత్‌ వరుసగా రెండో రోజు ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. అయితే విచారణలో భాగంగా అప్పగించిన ఫోన్లను యాక్సెస్ చేయడానికి కవిత లేదా ఆమె తరఫున ప్రతినిధి ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా అధికారులు కోరారు. ఈ క్రమంలోనే మంగళవారం కవిత ప్రతినిధిగా సోమా భరత్ ఢిల్లీలోని  ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఆయన సమక్షంలోనే కవిత సమర్పించిన ఫోన్లను యాక్సెస్ చేసి.. డేటాను సేకరించినట్టుగా తెలుస్తోంది. అయితే తాజాగా మరోసారి ఈరోజు సోమా భరత్ ఈడీ కార్యాలయానికి వచ్చారు. 

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మూడు రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ నెల 11, 20, 21 ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో అధికారులు కవితను విచారించారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 21న  ఈడీ విచారణకు హాజరైన సమయంలో కవిత తన  ఫోన్‌లను ఈడీ అధికారులకు అందజేశారు. ఆ రోజు ఉదయం ఢిల్లీలోని కేసీఆర్ నివాసం వద్ద, ఈడీ కార్యాాలయం వద్ద.. తాను అధికారులకు అప్పగించేందుకు తీసుకెళ్తున్న ఫోన్లను మీడియా ముందు ప్రదర్శించారు. 

ఇక, ఈ నెల 16వ తేదీన కూడా కవిత ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. ఆ సమయంలో కూడా తాను  హాజరుకాలేదని, తన ప్రతినిధితిగా సోమా భరత్‌ను పంపుతున్నట్టుగా కవిత చెప్పిన సంగతి  తెలిసిందే. ఆ రోజు కవిత ప్రతినిధిగా సోమా భరత్ ఈడీ కార్యాలయానికి  వెళ్లారు. 

PREV
click me!

Recommended Stories

Rugby Premier League: ముంబైని చితక్కొట్టిన హైదరాబాద్ హీరోస్.. గచ్చిబౌలిలో చిరంజీవి, పీవీ సింధు హంగామా
నల్గొండ భహిరంగ సభలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Inaugurates Development Works