ఢిల్లీ లిక్కర్ స్కామ్‌.. మరోసారి ఈడీ కార్యాలయానికి కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు..

Published : May 03, 2023, 12:09 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌.. మరోసారి ఈడీ కార్యాలయానికి కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు..

సారాంశం

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది.

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. దీంతో బుచ్చిబాబు ఈరోజు ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ అధికారులు బుచ్చిబాబును మరోమారు ప్రశ్నించే అవకాశం ఉంది. 

ఈ కేసులో సౌత్ గ్రూప్ తరపున బుచ్చిబాబు కీలక పాత్ర పోషించారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈడీ, సీబీఐ అధికారులు బుచ్చిబాబును వేర్వేరుగా విచారించిన సంగతి తెలిసిందే. ఇదే కేసుకు సంబంధించి బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేయగా.. ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్